CM KCR: బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు కేసీఆర్‌ లేఖ.. ఆ లెటర్‌లో ఏముందంటే..?

కార్యకర్తల కృషితోనే పార్టీకి రెండుసార్లు అధికారం లభించిందని, నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యలు తెలుసుకోవాలని కేసీఆర్ తన లేఖలో..

CM KCR: బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు కేసీఆర్‌ లేఖ.. ఆ లెటర్‌లో ఏముందంటే..?
Kcr Letter To Brs Activists

Updated on: Mar 20, 2023 | 7:23 PM

భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌’ని బలోపేతం చేసేందుకు మరింత కృషి చేయలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పార్టీ కార్యకర్తలకు లేఖరాశారు. ఈ క్రమంలో కార్యకర్తల కృషితోనే పార్టీకి రెండుసార్లు అధికారం లభించిందని, నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యలు తెలుసుకోవాలని కేసీఆర్ తన లేఖలో తెలియజేశారు. ఇంకా టీఆర్ఎస్ పార్టీ బీఆర్‌ఎస్‌‌గా ఏర్పడిన తరువాత బీజేపీ బరితెగించి దాడులు చేస్తోందన్నారు. ఇంకా కార్యకర్తలను ఉద్దేశించి ‘బీఆర్‌ఎస్‌ ప్రయాణంలో మీరే నా బలం.. బలగం. దేశం కోసం జరిగే పోరాటంలో ధర్మమే విజయం సాధిస్తుంద’ని అన్నారు. తెలంగాణతో పాటు దేశం కూడా బాగుపడాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలకు తన ఆత్మీయ సందేశంతో పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..