Telangana CM KCR in Halia meeting: ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచారు.నల్గొండ జిల్లాలో 15 ఎత్తిపోతల పథకాలు మంజూరు చేసినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. వీటన్నింటినీ ఏడాదిన్నరలో పూర్తిచేస్తామని చెప్పారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా హాలియాలో నిర్వహించిన బహిరంగసభలో సీఎం మాట్లాడారు.
ఇక, తొలిసారి కృష్ణా నదీ జలాల వివాదంపై స్పందించారు సీఎం కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదా గిరి చేస్తోందని మండిపడ్డారు. కృష్ణాపై ఏపీ అక్రమ ప్రాజెక్ట్‌లు కడుతోందని ఆరోపించారు. అటు, తెలంగాణపై పెత్తనం చేయాలని కేంద్రం చూస్తోందని విమర్శించారు. భవిష్యత్తులో కృష్ణా నీళ్లకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉందన్న కేసీఆర్.. గోదావరి నీళ్లను పాలేరు వరకు తరలిస్తామని ప్రకటించారు. కృష్ణా జలాలపై రానున్న రోజుల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌ను గెలిపించినందుకు ప్రజలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. తనకు కరోనా సోకడంతో నియోజకవర్గానికి రావడం ఆలస్యమైందన్న కేసీఆర్.. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చి తీరుతామన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు మంజూరు చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అదనంగా హాలియా, నందికొండ అభివృద్ధికి రూ.15 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్లు తెలిపారు.
కృష్ణాపై ఏపీ అక్రమ ప్రాజెక్ట్‌లు కడుతోందని, కేంద్రం తెలంగాణ వ్యతిరేకత వైఖరిని అవలంభిస్తోందని విమర్శించారు. భవిష్యత్తులో కృష్ణా నీళ్లకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి, గోదావరి నీళ్లను పాలేరు వరకు తరలిస్తామని ప్రకటించారు కేసీఆర్.
Read Also…