ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ విసిరిన వీడియో బ్రహ్మాస్త్రం కాకరేపుతోంది. తాజా వీడియో పొలిటికల్ సర్కిల్స్‌ను షేక్ చేస్తోంది. నాట్ ఓన్లీ టీజర్.. పిక్చర్ అభీ బాకీ హై అంటూ చెబుతూ కేసీఆర్ వదలిన ట్రైలర్.. ఢిల్లీని షేక్ చేయబోతోందా? ఫామ్‌హౌస్‌లో జరిగిన బేరసారాల దృశ్యాలను ప్రపంచం ముందు పెట్టారు కేసీఆర్. మరి నెక్స్ట్ ఏంటి? ఫామ్ హౌస్ సీక్రెట్స్‌ని తిరుగులేని ఆయుధంగా మలచుకుని.. ఢిల్లీ లెవెల్లో హైలైట్ చేయాలని భావిస్తుంటే.. బీజేపీ మాత్రం.. మొన్న ఆడియో.. నిన్న వీడియో.. అందులో అసలు ఏముందంటూ ఎదురుదాడికి దిగుతున్నారు.
మా రాజధానికి వచ్చి నా ప్రభుత్వాన్ని కూలగొడుతానంటే ఊరుకుంటామా అంటూ కేసీఆర్ అంటుంటే.. ఆముగ్గురితో మాకు ఎలాంటి సంబంధం లేదంటోంది బీజేపీ. మునుగోడులో గెలుపు కోసం బీజేపీ ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని అరాచకాలు చేసిందన్నారు కేసీఆర్. దీనికి బీజేపీ తెలంగాణ ఇంచార్జి తరుణ్‌చుగ్ కౌంటర్ ఇచ్చారు. మునుగోడులో కేసీఆర్ ధనబలం ఓడిపోయిందన్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య నేతల కొనుగోలు వ్యవహారం అగ్గిరేపుతోంది. రోజుకో టర్న్ తీసుకుంటూ కాకరేపుతోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రమాణాల సవాళ్లు చలిలో వేడిపుట్టిస్తున్నాయి. నిన్న కేసీఆర్ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ఢిల్లీ పెద్దలు స్కెచ్ వేశారంటూ కేసీఆర్ ఆధారాలు బయటపెట్టగా, అవన్నీ కట్టుకథలు. వాళ్లకు మాకు ఎలాంటి సంబంధం లేదంటూ రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. అంతేకాదు మీరు నేతలను కొనలేదా అంటూ ప్రశ్నిస్తూ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. టీఆర్ఎస్ లోకి లాక్కున్న ఇతర పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల జాబితా విడుదల చేశారు.
మరోవైపు అవినీతి, అబద్ధాలపై బండి సంజయ్ యాదాద్రిలో ప్రమాణానికి రమ్మని సవాల్ విసిరితే టీఆర్‌ఎస్ నాయకులు ఒక్కరు కూడా కదల్లేదన్నారు. ఇప్పుడు నేను కూడా చాలెంజ్ చేస్తున్నా అన్నారు తరుణ్‌చుగ్. ఇలా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రోజురోజుకు తారా స్థాయికి చేరుకుంటోంది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలు, సవాళ్లు విసురుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి