CM KCR New Strategy: హుజురాబాద్‌ ఉప ఎన్నిక ముందు సీఎం కేసీఆర్‌ కొత్త వ్యూహం.. ఆసక్తికరంగా మారిన తెలంగాణ రాజకీయాలు

|

Jun 26, 2021 | 10:57 PM

CM KCR New Strategy: సీఎం కేసీఆర్‌ రాజకీయ ఎత్తుగడలు ఎవరికీ అంతగా అంతుపట్టవు. ముఖ్యంగా ప్రతిపక్షాలను చిత్తు చేయడంలోనూ, విమర్శలు గుప్పించే వారిని తన దారికి తెప్పించుకోవడం..

CM KCR New Strategy: హుజురాబాద్‌ ఉప ఎన్నిక ముందు సీఎం కేసీఆర్‌ కొత్త వ్యూహం.. ఆసక్తికరంగా మారిన తెలంగాణ రాజకీయాలు
CM KCR
Follow us on

(రాకేష్ రెడ్డి చాపల, TV9 తెలుగు రిపోర్టర్)

CM KCR New Strategy: సీఎం కేసీఆర్‌ రాజకీయ ఎత్తుగడలు ఎవరికీ అంతగా అంతుపట్టవు. ముఖ్యంగా ప్రతిపక్షాలను చిత్తు చేయడంలోనూ, విమర్శలు గుప్పించే వారిని తన దారికి తెప్పించుకోవడంలోను ఆయనది పక్కా పొలిటికల్ వ్యూహం. ఎప్పుడూ లేనిది ప్రతిపక్షాలకు ప్రగతి భవన్ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం, ఆ వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం ఇదంతా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రతిపక్షాలకు ప్రాధాన్యత ఇస్తున్నారా..? లేదా తన మార్క్ వ్యూహంతో వల విసురుతున్నారు ? అన్నది ఆసక్తిగా మారింది.

అయితే తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఎప్పుడూ దొరకలేదు. కొన్నిసార్లు ముఖ్యమంత్రిని కలవడానికి ప్రగతి భవన్ కు వచ్చిన ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన సందర్భాలూ ఉన్నాయి. కానీ గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి ధోరణి మారింది.  రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ ఇచ్చి వారు తీసుకొచ్చిన సమస్యలపై జెట్ స్పీడ్ లో స్పందించారు. ఒక రకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా షాక్ తినేంతగా రియాక్షన్ ఇచ్చారు కేసీఆర్.  ఏదో వినతి పత్రం తీసుకొని చర్యలు తీసుకుంటాను కామన్ గా సీఎం చెబుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావించారు. కానీ సీఎం కేసీఆర్‌ మరియమ్మ లాక్ అప్ డెత్ పై స్పందించిన విధానం, నష్టపరిహారం ప్రకటించడం, దళితుల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించడం ఇదంతా కేసీఆర్ మార్క్ రాజకీయం.

తెలంగాణ ఏర్పడిన మొదట్లో రెండు, మూడు సార్లు అఖిలపక్షం ఏర్పాటు చేసిన తర్వాత ఆరేళ్లుగా ప్రతిపక్షాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేసులు వేయడం, అవినీతి విమర్శలు చేయడంపై కేసీఆర్ చాలాసార్లు సీరియస్ అయ్యారు. అటు తమిళనాడులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన స్టాలిన్ కరోనా నివారణ కమిటీకి చైర్మన్ గా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని నియమించారు. ఆ విధానం తమిళనాడులో కొంత సక్సెస్ అయింది.  ఆ మంత్రం కేసీఆర్ ఫాలో అవుతున్నారా..? లేదా రాజకీయ సమీకరణాలు మారుతున్న తరుణంలో కొత్త వ్యూహాలకు పదును పెట్టారా? అనే చర్చ జరుగుతోంది. మరోవైపు అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీల నేతలను పిలిచి.. ప్రగతి భవన్‌లో వారితో కలిసి భోజనం కూడా చేసేందుకు నిర్ణయిచుకున్నారు సీఎం కేసీఆర్‌.

తాను అనుకున్న దారిలోకి ప్రతిపక్షాలను తెచ్చుకోవడంలో కేసీసిఆర్ దిట్ట. ఉద్యమ సమయంలోనూ ఇలాంటి వ్యూహంతోనే తెలంగాణ సాధించారు. ఇప్పుడు పదును పెడుతున్న ఈ వ్యూహం, ప్రతిపక్షాలకు అందిస్తున్న స్నేహ హస్తం దేనికోసం అనేది ఆసక్తికరంగా మారింది.

ఇవీ కూడా చదవండి:

YS Sharmila : మహానేతను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా సహించేదిలేదు.. ఖబడ్దార్ : వైయస్ షర్మిల

Bhatti : ‘ఒక దళిత ఎమ్మెల్యేగా నేను మౌనంగా ఉండలేనురా దుర్మార్గుడా..! శవాల మీద పేలాలు ఎరుకునే దౌర్భాగ్యుడా.!’