CM KCR: దేశ రాజకీయాలపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు సీఎం కేసీఆర్. దేశం దారి తప్పుతోందన్నారు. దుర్మార్గమైన పనులు దేశంలో జరుగుతున్నాయని విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్ (CM KCR). బుధవారం మల్లన్నసాగర్ (Mallanna Sagar )ప్రారంభోత్సవం అనంతరం ప్రసంగించారు. కర్నాటకలో మతకల్లోలాలు రేపారని ఆరోపించారు. ఆడపిల్లలు అక్కడ చదవాలంటేనే భయపడుతున్నారని.. దేశంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. మతకల్లోలాలు జరిగితే ఎవరైనా ఇక్కడ పరిశ్రమలు పెడతారా? అని ప్రశ్నించారు. ఇలాంటి పనులు దేశానికి మంచిది కాదని.. ఆ క్యాన్సర్‌ని విస్తరించరాదంటే.. ఎక్కడికక్కడ నరికి నలిపేయాలన్నారు సీఎం. జాతీయ రాజకీయాలు ప్రభావితం జరిగేలా మందుకెళ్తున్నానని, హైదరాబాద్ ఐటీ పెరుగతోందని పేర్కొన్నారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, మన కలలు కన్న తెలంగాణ రాష్ట్రంలో పాటు సస్యశ్యామల తెలంగాణను చూస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడ్డ అతి భారీ జలాశయం మల్లన్న సాగర్‌ను ప్రారంభించుకోవడం హర్షించుకోదగ్గ ఘట్టమన్నారు.
గోదావరి నీళ్లు తెచ్చి కొమురవెల్లి మల్లన్న పాదాలను కడుగబోతున్నామని, గోదావరి జలాలతో అభిషేకం చేయబోతున్నామన్నారు. అయితే సింగూరు ప్రాజెక్టును తలదన్నేలా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, సిద్దిపేటకే కాకుండా హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా దాహార్తిని తీర్చే ప్రాజెక్టు మల్లన్నసాగరని సీఎం అన్నారు. ప్రాజెక్టు కోసం 58వేల మంది కార్మికులు పని చేశారని, ఈ మహాయజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు సీఎం కేసీఆర్. బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మల్లన్న సాగర్ నిర్మాణం జరిగిందని, 9 జిల్లాల వరప్రదాయినిగా నిలిచిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్ అని, నూతన తెలంగాణ నిర్మించుకున్న అతిపెద్ద ప్రాజెక్టు మల్లన్నసాగర్ అని కేసీఆర్ వెల్లడించారు. అయితే నిర్మాణం జరుగుతున్న సమయంలో ప్రాజెక్టు పనులను ఆపాలని కొందరు కోర్టుకు వెళ్లారని, ప్రాజెక్టును ఆపే కుట్రలో భాగంగా వందలాది కేసులు వేశారని గుర్తు చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకడుగు వేయకుండా ముందుకెళ్లామన్నారు.
ఇవి కూడా చదవండి: