KCR: 5వ రోజూ సీఎం కేసీఆర్ హస్తిన టూర్.. ఇవాళ రాష్ట్రపతి సహా పలువురితో మీటింగ్స్

|

Sep 05, 2021 | 9:54 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజధాని హస్తినలో సుదీర్ఘ పర్యటన చేస్తున్నారు. కేసీఆర్ ఢిల్లీ టూర్ నేటికి ఐదవ రోజూ కొనసాగుతోంది.

KCR: 5వ రోజూ సీఎం కేసీఆర్ హస్తిన టూర్..  ఇవాళ రాష్ట్రపతి సహా పలువురితో మీటింగ్స్
Kcr
Follow us on

CM KCR Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజధాని హస్తినలో సుదీర్ఘ పర్యటన చేస్తున్నారు. కేసీఆర్ ఢిల్లీ టూర్ నేటికి ఐదవ రోజూ కొనసాగుతోంది. శుక్రవారం ప్రధానితో భేటీ, శనివారం కేంద్ర హోంమంత్రితో చర్చించారు. యాదాద్రి ఆలయ పునః ప్రారంభానికి ఆహ్వానం పలికారు. షాతో 45 నిమిషాలు చర్చలు జరిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత పెరిగిన కొత్త జిల్లాలు, అందుకు తగ్గట్లు IPS పోస్టుల పెంపుపై ప్రధానంగా చర్చించారు. నూతన జిల్లాలు, పోలీస్ కమిషనరేట్లు పెరిగిన నేపథ్యంలో ఐపీఎస్‌ పోస్టులను సమీక్ష చేయాలని వినతిపత్రం అందించారు. గతంలో 9 జిల్లా పోలీసు కార్యాలయాలు, 2 పోలీసు కమిషనరేట్లు ఉండేవని, ప్రస్తుతం పాలన సౌలభ్యం కోసం జిల్లాల విభజన జరిగిందని వివరించారు.

20 జిల్లా పోలీసు కార్యాలయాలు, 9 పోలీసు కమిషనరేట్లు ఉన్నాయని హోంమంత్రికి చెప్పారు. 76 సీనియర్ డ్యూటీ పోస్టులతో కలిపి మొత్తం 139 ఐపీఎస్ పోస్టులను హోంశాఖ ఆమోదించిందని సీఎం కేసీఆర్.. అమిత్ షా తో పేర్కొన్నారు. ప్రస్తుతం కొత్త జిల్లాలు, కొత్త జోన్లు ఏర్పడ్డాయి కాబట్టి కొత్తగా 29 సీనియర్ డ్యూటీ పోస్టులతో పాటు మొత్తం 195 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని కోరారు ముఖ్యమంత్రి.

త్వరలోనే జరిగే యాదాద్రి ఆలయ పునఃప్రారంభానికి రావాలని ఆహ్వానం పలికారు సీఎం కేసీఆర్‌. కాగా, మరో రోజు ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తోసహా మరికొందరు ప్రముఖుల్ని కలిసి యాదాద్రికి రావాలని ఆహ్వానిస్తారని సమాచారం.

Read also: Afghanistan: పాక్ చేతిలో కీలుబొమ్మలుగా తాలిబన్లు..! ఐఎస్‌ఐ చీఫ్‌ కాబూల్‌ పర్యటనతో కొత్త పరిణామాలు