రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తెలంగాణ ముద్దుబిడ్డ బాక్సర్ నిఖత్ జరీన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.2 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరుణంలో 6 గ్యారెంటీలలో భాగంగా.. నేడు 2 పథకాలను అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. చేయూత, మహాలక్ష్మీ పథకాలను లాంఛ్ చేశారు. ఈ సందర్భంలో బాక్సర్ జరీన్‌కు ఈ ఆర్థిక సహాయం అందజేశారు.
కాగా, ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 50 కిలోల విభాగంలో జరీన్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఆమెకు ఇది రెండో బంగారు పతకం కావడం గమనార్హం.
Live: CM Sri @Revanth_Anumula launching Free Travel in TSRTC Buses for girls and women under #MahalakshmiScheme. Hon’ble CM is also launching #RajivAarogyasri under #Cheyutha scheme which provides ₹10 lakh health insurance coverage per family per year. https://t.co/YCnl1fWOJ2
— Telangana CMO (@TelanganaCMO) December 9, 2023
కాగా, గతేడాది టర్కీలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన నిఖత్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.2 కోట్ల నగదు బహుమతితోపాటు, హైదరాబాద్‌లో నివాస స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన ఐదవ భారతీయ మహిళా బాక్సర్‌గా నిలిచింది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..