TRS Party Meeting: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం తెలంగాణ భవన్‌లో తెలంగాణ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్తంగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులనుద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా లోక్ సభ స్థానాలపై కేసీఆర్ స్పందించారు. రానున్న కేంద్ర రాజకీయాల్లో మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. లోక్ సభలో మనమే కీలకం కాబోతున్నామని వ్యాఖ్యానించారు. లోక్ సభ స్థానాలపై మరింత దృష్టి పెట్టాలని, మన స్థానాలు పెరగాలని అన్నారు. ఇక ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణభవన్‌లో నిర్వహించగా.. సాయంత్రం 5.45 కి ముగిసింది. పార్టీ సంస్థాగత నిర్మాణం, హెచ్‌ఐసీసీలో అక్టోబర్ 25వ తేదీన నిర్వహించనున్న ప్లీనరీ, అలాగే, వచ్చే నెల 15న వరంగల్‌లో తలపెట్టిన తెలంగాణ విజయగర్జన సభ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఇదిలా ఉండగా.. నేటి నుంచి ఈ నెల 22 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.
ఈనెల 23న ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన.. 24న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఈ నెల 25 హైటెక్స్‌లో నిర్వహించే టీఆర్ఎస్ ప్లీనరీలో అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. నేటి నుంచి 22 తేదీవరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తెలంగాణ భవన్‌లో నామినేషన్లు స్వీకరించునున్నారు.
కాగా, ప్రతి పక్షాలకు దిమ్మదిరిగేలా ప్రజాగర్జన సభ ఉంటుందని కేసీఆర్ ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. ప్రతి రోజు 20 నియోజక వర్గాల సన్నాహక సమావేశాలను తెలంగాణ భవన్‌లో నిర్వహించాలన్నారు. ఈ నెల 15న వరంగల్ ప్రజాగర్జన సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. సందర్భంగా పలు అంశాలపై సీఎం టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు, నేతల ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. హుజరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.