Telangana Cabinet Meet: సెప్టెంబర్‌ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరపాలి.. తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

Telangana Cabinet Meet: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన కేబినెట్‌ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్‌ 17ను..

Telangana Cabinet Meet: సెప్టెంబర్‌ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరపాలి.. తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
Ts Cm Kcr

Updated on: Sep 03, 2022 | 7:19 PM

Telangana Cabinet Meet: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన కేబినెట్‌ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్‌ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరపాలని కేబినెట్‌ నిర్ణయించింది. 16,17,18వ తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా వజ్రోత్సవాలు ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 2023 సెప్టెంబర్‌ 16,17, 18న ముగింపు వేడుకలు నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారి 75 ఏళ్లు పూర్తయ్యిందని తెలిపింది.

దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు సీఎం కేసీఆర్‌. అలాగే ప్రభుత్వ బిల్లులపై కూడా చర్చించారు. విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్ర సర్కార్‌ వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎలా వ్యవహరించాలనే దానిపై చర్చించారు. సీబీఐకి రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వరాదన్న అంశంపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్‌.. టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో పాల్గొననున్నారు.

మరిన్ని కేబినెట్ నిర్ణయాలు

ఇవి కూడా చదవండి

☛ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభంలో భాగంగా 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను కేబినెట్ ఈ విధంగా నిర్ణయించింది. సెప్టెంబర్ 16 వ తేదీన.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు నిర్వహించాలి.

☛ సెప్టెంబర్ 17: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి ప్రసంగిస్తారు. అదే రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, మున్సిపాలిటీ, పంచాయతీ కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలి.

☛ అదే రోజు (సెప్టెంబర్ 17) మధ్యాహ్నం బంజారా ఆదివాసీ భవన్‌ల ప్రారంభోత్సవం. నక్లెస్ రోడ్డు నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ఊరేగింపు ఉంటుంది. అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు.

☛ సెప్టెంబర్ 18: అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానాలు. కవులు కళాకారులను గుర్తించి సత్కరించాలి. ఘనంగా తెలంగాణ స్పూర్తిని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి