
రాష్ట్రంలో పర్యాటకరంగం రూపు రేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నది. జాతీయ, అంతర్జాతీయ టూరిస్టులను ఆకట్టుకునేలా యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్ టూరిజంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. పర్యాటకులకు మధురానుభూతి కలిగించేలా కేరళ, కర్ణాతక తరహాలో సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. నాగార్జున సాగర్ పరిసరాలు, ముఖ్యంగా డ్యామ్ కొత్త బ్రిడ్జి రోడ్డు, బుద్ధవనం పరిసరాలు వీకెండ్స్‌లో పర్యాటకులతో సందడిగా ఉంటాయి. పర్యాటకులు ఇక్కడ బోటింగ్, డ్యామ్ వ్యూ పాయింట్, బుద్ధవనం సందర్శనకు ప్రాధాన్యత ఇస్తారు. నాగార్జునసాగర్ కు వచ్చే పర్యాటకుల సైకిల్ రైడింగ్ కు అద్దె సైకిళ్ల సౌకర్యాన్ని కల్పిస్తోంది.
సాగర్ సందర్శనకు వచ్చి విజయ విహార్ లో బస చేసి సాయంత్రం సమయంలో సరదాగా సైకిల్ తొక్కాలనే కోరిక కలిగిన పర్యాటకుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సైకిళ్లను ఏర్పాటు చేసింది. నాగార్జున సాగర్ పరిసరాలు, ముఖ్యంగా ఎకో అర్బన్ పార్క్, బుద్ధవనం ప్రాంతాలలో పర్యాటకులు సైక్లింగ్ ఆస్వాదించడానికి సౌకర్యాలు అందుబాటులోకి వస్తోంది.
Rent Bicycles in Nagarjuna Sagar
పచ్చని ప్రకృతి మధ్య, సాగర్ డ్యామ్ వీక్షణతో కూడిన సైక్లింగ్ ఇక్కడ పర్యాటకులకు కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. మొదటగా విజయ విహార్ అతిథి గృహంలో గది తీసుకున్న వారికి గంటకు రూ. 100కు సైకిల్ అద్దెగా ఇవ్వడంతో పాటు వాటర్ బాటిల్, హెల్మెట్ ఇవ్వడం జరుగుతుందని విజయ విహార్ మేనేజర్ కిరణ్ కుమార్ చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..