కరీంనగర్, జూన్ 18: హోంమంత్రి మహమూద్ అలీ వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. దుస్తులు ఎలా వేసుకోవాలో మహిళలకు తెలుసన్నారు. హోంమంత్రి అలీ మహిళలను కించపరిచారని ఆందోళన వ్యక్తం చేశారు. మహమూద్ అలీ ఎవరికి హోంమంత్రి..? అని ప్రశ్నించారు. మహిళల దుస్తుల మీద కాదు.. ఉగ్రవాదుల మీద దృష్టి పెట్టని సూచించారు. మహిళలు గాజులు, బొట్టు పెట్టుకుంటే తీసేసినప్పుడు ఎక్కడ ఉన్నావంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. అసలు నువ్వు హోంమంత్రి అని ఎవరికైనా తెలుసా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థులను కూడా సీఎం కేసీఆరే డిసైడ్ చేస్తారని ఎద్దేవ చేశారు. 30 మంది అభ్యర్థుల జాబితా సిద్ధం చేశారని..
తెలంగాణ అభివృద్ధి పై చర్చకు కిషన్ రెడ్డి వస్తారు.. సీఎం కేసీఆర్ వస్తారా అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. చర్చ ఎక్కడ పెట్టినా సరే రెడీ అన్నారు. పరేడ్ గ్రౌండ్ లో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. హైదరాబాద్ దేశ రెండో రాజధాని పై పార్టీలో చర్చిస్తామన్నారు. తెలంగాణకు ఏది మంచో అదే చేస్తామన్నారు బండి సంజయ్.
మహిళలు పొట్టిదుస్తులు ధరించడం మంచిదికదాన్నారు మంత్రి. హిజాబ్ వివాదంపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసిన మహమూద్ . బుర్ఖావేసుకోవద్దని ఎవరూ చెప్పడంలేదన్నారు మంత్రి. పొట్టి దుస్తులు ధరించడం వల్లే సమస్యలు వస్తున్నాయన్న మహమూద్ అలీ అనడంతో తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
మరిన్ని తెలగాణ వార్తల కోసం