Telangana Liberation Day: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా ఉద్యమమైన తెలంగాణ విముక్తి పోరాటం.. ముమ్మాటికీ విమోచన దినోత్సవమే అంటూ కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా.. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. చరిత్రను మరుగుపరిచే కుట్రలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమమైన తెలంగాణ విముక్తి పోరాటం.. ముమ్మాటికీ విమోచన దినోత్సవమే అన్నారు. కొందరు కావాలనే చరిత్ర వక్రీకరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..
కాగా.. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అమిత్ షా తెలంగాణ, హైదరాబాద్-కర్ణాటక & మరాఠ్వాడా ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నాటి హైదరాబాద్ సంస్థాన ప్రజలందరికీ హైదరాబాద్ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. నిజాం దుష్ట పాలన, అణచివేత నుండి విముక్తి కోసం హైదరాబాద్ సంస్థాన ప్రజలు సాగించిన అలుపెరగని పోరాటానికి, ఇక్కడి ప్రజల అచంచల దేశభక్తికి ఈ రోజు నిదర్శనం. హైదరాబాద్ విముక్తి పోరాటంలో అమరులైన వీరులందరికీ నా హృదయపూర్వక నివాళులు.’’.. అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.
On Hyderabad Liberation Day, I extend my heartfelt best wishes to the people of Telangana, Hyderabad-Karnataka & Marathwada region.
This day marks the unwavering patriotism of the people of Hyderabad and commemorates their unyielding struggle to set themselves free from the… pic.twitter.com/DmY8ZQLqeQ
— Amit Shah (@AmitShah) September 17, 2023
ఇదిలాఉంటే.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్ వేదికగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరై ప్రసంగించనున్నారు. ఈ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే, అమిత్ షా ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి ఏం మాట్లాడుతారోనని నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు.#HyderabadLiberationDay pic.twitter.com/aN7sVrawbP
— BJP Telangana (@BJP4Telangana) September 17, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..