Telangana BJP: తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. మొన్న జరిగిన విజయ సంకల్ప సభ విజయవంతం కావడంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల పోరాటానికి రెడీ అయిపోయింది. మరోవైపు, నిన్న రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో తెలంగాణ కోర్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఆదివాసుల పోడు భూముల సమస్య, పోలీసుల దాడులపై చర్చించారు. పోడు భూములు, ధరణి పోర్టల్ సమస్యలకు నిరసనగా సోమవారం (నేడు) కరీంనగర్ లో దీక్షకు దిగుతున్నారు టీబీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్.
ముందస్తు లీకులు ఇవ్వొద్దు..
ఈటల రాజేందర్ కన్వీనర్ అయ్యాక జరిగిన తొలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌లో ముందస్తు లీకులు ఇవ్వవద్దని కార్యకర్తలను ఆదేశించారు. ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉందో.. అక్కడ మొదటి ప్రాధాన్యతగా గుర్తించి బలమైన నేతలను చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
బైక్ ర్యాలీకి ప్లాన్..
అంతేకాకుండా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒకే సారి బైక్ ర్యాలీకి ప్లాన్ చేసింది బీజేపీ కోర్ కమిటీ. ఈనెల 21 నుంచి అసెంబ్లీ నియోజక వర్గాల్లో బైక్ ర్యాలీలు చేయాలని కమిటీ నిర్ణయించింది. ప్రజల ఘోష – బీజేపీ భరోసా పేరుతో బైక్ ర్యాలీ సాగనుంది. మరోవైపు, ఆగస్టు మొదటి వారంలో బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామయాత్ర చేయాలని నిర్ణయించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి