Congress-CPI: సీపీఐకు కొత్తగూడెంతో పాటు ఒక ఎమ్మెల్సీ! సీరియల్‌ను తలపిస్తున్న కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీల పొత్తు కథ

|

Nov 04, 2023 | 10:00 PM

Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి ఊపందుకుంది. నామినేషన్ల ప్రక్రియసైతం ప్రారంభం కావడంతో టికెట్ దక్కిన ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కానీ సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీల వ్యవహారం కొలిక్కి రావడం లేదు. అయితే ఈ కథకు త్వరలోనే ఎండ్‌ కార్డ్‌ పడే సూచనలు కనిపిస్తున్నాయి.

Congress-CPI: సీపీఐకు కొత్తగూడెంతో పాటు ఒక ఎమ్మెల్సీ! సీరియల్‌ను తలపిస్తున్న కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీల పొత్తు కథ
Congress Cpi
Follow us on

Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి ఊపందుకుంది. నామినేషన్ల ప్రక్రియసైతం ప్రారంభం కావడంతో టికెట్ దక్కిన ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కానీ సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీల వ్యవహారం కొలిక్కి రావడం లేదు. అయితే ఈ కథకు త్వరలోనే ఎండ్‌ కార్డ్‌ పడే సూచనలు కనిపిస్తున్నాయి. సీపీఐకు కొత్తగూడెం సీటును కేటాయించేందుకు కాంగ్రెస్ దాదాపుగా అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే మరీ ఒక్క సీటేనా? అని అనుకోకుండా, ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ స్థానమూ కేటాయించేందుకు అంగీకారం కుదిరినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇరు పార్టీల మధ్య అనేక సార్లు చర్చలు.. పార్టీల్లో అంతర్గతంగానూ చర్చలు.. నేడో రేపో తేల్చాస్తామంటూ ప్రకటనల మధ్య సాగిన పొత్తు వ్యవహారం ఈ నిర్ణయంతో కొలిక్కివచ్చినట్టే తెలుస్తోంది. అయితే దీనిపై జాతీయ స్థాయిలో ప్రకటన వెలువడాల్సి ఉంది.

మరోవైపు కాంగ్రెస్‌తో పొత్తు లేదని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఇప్పటికే సీపీఎం ప్రకటించింది. పార్టీ పోటీ చేసే స్థానాల లిస్టును కూడా విడుదల చేసింది. కానీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాత్రం లెఫ్ట్ పార్టీలతో పొత్తు చర్చలు ఇంకా ముగియలేదని చెబుతున్నారు. పొత్తులపై జాతీయ నాయకత్వాలు ప్రకటన చేస్తాయని.. కొంతమంది కావాలని కాంగ్రెస్‌, వామపక్షాల పొత్తుపై కన్‌ఫ్యూజ్‌ క్రియేట్‌ చేస్తున్నారని విమర్శించారు.

రెండు విడతల్లో 100 నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా..ఇంకా 19 స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే రెండో జాబితా వేళ చెలరేగిన అసమ్మతిని దృష్టిలో ఉంచుకుని ఈ సారి అప్రమత్తంగా వ్యవహారించాలని భావిస్తోంది హస్తం పార్టీ. అందుకే జాబితా విడుదలలో జాప్యం జరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. మరోవైపు పొత్తు చర్చలు కొలిక్కిరాకపోవడం వల్లే మూడో జాబితా ఆలస్యం అవుతోందన్న కామెంట్స్‌ కూడా వినిపిస్తున్నాయి. ఆ మూడో జాబితా విడుదల అయితే గానీ ఊహాగానాలు తెరపడే సూచనలు కనిపించడం లేదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..