Telangana Election: బీజేపీ అధికారంలోకి వస్తే, గల్ఫ్ వలస కార్మికుల బాధలకు చెక్.. హామీ ఇచ్చిన అమిత్ షా

బతుకు దెరువు కోసం వెళ్ళే భారతీయులకు భారతీయ జనతా పార్టీ అండగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జీవనోపాధి వెతుక్కుంటూ ఇతర దేశాలకు వెళ్ళే వలస కార్మికుల ప్రత్యేక గుర్తింపు తీసువస్తామన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రత్యేకంగా ప్రవాస భారతీయుల (NRI) మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.

Telangana Election: బీజేపీ అధికారంలోకి వస్తే, గల్ఫ్ వలస కార్మికుల బాధలకు చెక్.. హామీ ఇచ్చిన అమిత్ షా
Union Home Minister Amit Shah participates in Telangana election campaign At Bhuvanagiri, Mulugu Districts

Updated on: Nov 25, 2023 | 4:19 PM

బతుకు దెరువుకు వేరే దేశాలకు వెళ్ళే భారతీయులకు భారతీయ జనతా పార్టీ అండగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జీవనోపాధి వెతుక్కుంటూ ఇతర దేశాలకు వెళ్ళే వలస కార్మికుల ప్రత్యేక గుర్తింపు తీసువస్తామన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రత్యేకంగా ప్రవాస భారతీయుల (NRI) మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆర్మూర్ నియోజకవర్గంలో నిర్వహించిన బీజేపీ బహిరంగసభలో కేంద్ర హోంమత్రి పాల్గొన్నారు.

ఉపాధి వెతుక్కుంటూ గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు చాలా మంది ఉన్నారని, సరియైన ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించేందుకు కృషీ చేస్తామన్నారు. వారి సంక్షేమానికి కృషి చేసేలా ప్రత్యేక NRI మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించామన్న అమిత్ షా, దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానం నిలబెడతామన్నారు అమిత్ షా.

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుటుంబ పాలనకు ప్రాధాన్యత ఇస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా పరిపాలన సాగించిన రెండు పార్టీలు – బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయని ఆయన ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతి పరులను జైల్లో పెడతామన్నారు.

ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. బీడీ కార్మికుల ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా నేషనల్ టర్మరిక్ బోర్డు (ఎన్‌టీబీ), పరిశోధనా కేంద్రం, 500 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని హోంమంత్రి గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు షా. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న అమిత్ షా, బాయిల్డ్ రైస్‌కు కనీస మద్దతు ధర కూడా ఇస్తామని చెప్పారు.

చౌటుప్పల్‌లో అమిత్‌ షా రోడ్‌ షో

అనతరం చౌటుప్పల్‌లో నిర్వహించిన రోడ్‌ షోలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి తరుపున ప్రచారం నిర్వహించారు. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే లాభం లేదన్న అమిత్ షా… కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోతారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. కేసీఆర్‌కు ఓటేసినట్టే స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ సర్కార్‌ ఏర్పాటు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభమవుతుందని, అయోధ్య రాముడిని ప్రతి ఒక్కరు దర్శించుకోవాలన్న అమిత్‌షా, తెలంగాణ ప్రజలందరికీ ఉచితంగా అయోధ్య దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…