
నచ్చిన ఇంటిని కొనుక్కుని, డౌన్ పేమెంట్ ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకుని, రిజిస్ట్రేషన్ కోసం చలానా కూడా కట్టి, స్లాట్ బుక్ చేసుకుని తీరా సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుకెళితే, దగాపడ్డావ్ పో అని ఆఫీసర్లు వెక్కిరించి వెనక్కు పంపేస్తే..! ఎక్కడో మారుమూల గ్రామంలో కాదు, భాగ్యనగరం నడిబొడ్డు నుండే పేరుమోసిన కాలనీల్లోనే ఇటువంటి చేదు అనుభవాలు కోకొల్లలు. నెలలు గడుస్తున్నా రిజిస్ట్రేషన్ కాక, ఇచ్చిన డబ్బులు తిరిగి వెనక్కీ రాక అనుభవిస్తున్న ఈ మానసిక క్షోభ ఒక్కరిది కాదు, లక్షలమందిది. స్థిరాస్థి అనే మాటకే కొత్త అర్థాన్ని చెబుతున్న 22A భూతాన్ని తరిమికొట్టడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నట్టున్నాయి. కానీ, ఇలా కంకణం కట్టుకున్నంత మాత్రాన పనైపోతుందన్న భరోసాలైతే 22A పీడితులకు లేవుగాక లేవు. ఎవరితోనైనా దగా పడితే ప్రభుత్వానికి చెప్పుకుంటాం. కానీ, ప్రభుత్వమే తప్పయిపోయింది సారీ అని లెంపలేసుకుంటే ఎవరికి చెప్పుకోవాలి? తెలిసితెలిసీ జనాన్ని కష్టాల్లో తోసిన ప్రభుత్వ యంత్రాంగమే, దిద్దుబాటు చేస్తాం బేఫికర్ అని భుజం తట్టాల్సిన పరిస్థితి. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఎప్పటికైనా అంతో ఇంతో స్థిరాస్థి కొనుక్కోవాలన్న కలను నిజం చేసుకోడానికి జీవితమంతా కష్టపడి పోగుచేసుకున్న సొత్తు.. పరాధీనమైతే..! ఆల్రెడీ కొనుక్కున్న రెండు గదుల ఇంల్లో అర సెంటు భూమి మనది కాదని...