Telangana: డెంగీతో పంజా విసిరిన మృత్యువు.. నిండు గర్భిణి మృతి.. పురిట్లోనే కవలలు కూడా

|

Aug 02, 2024 | 12:24 PM

డెంగీ రూపంలో పంజా విసిరిన మృత్యువు తల్లితోపాటు పురిట్లోని ఆడబిడ్డల ప్రాణాల బలిగొంది. ఈ విషాద ఘటన హనుమకొండ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది.

Telangana: డెంగీతో పంజా విసిరిన మృత్యువు.. నిండు గర్భిణి మృతి.. పురిట్లోనే కవలలు కూడా
Sirisha
Follow us on

ఇలాంటి ఘటనలు చూసినప్పుడు.. విన్నప్పుడు దేవుడిపై కూడా కోపం వస్తుంది. ఏం పాపం చేశారు.. ఆ శిశువులు.. ఇంకా లోకాన్ని కూడా చూడకుండానే కన్నుమూశారు. నిండు గర్భిణి డెంగీతో కన్నుమూసిన విషాద ఘటన హనుమకొండ జిల్లాలో వెలుగుచూసింది. తన కడుపులో ఉంది కవలలు అని తెలిసి.. ఆ తల్లి ఆనందం అంతా ఇంతా కాదు.. మరో వారంలో డెలివరీ అవుతుందని డాక్టర్లు చెప్పడంతో.. రోజులు లెక్కబెట్టుకుంటూ తన బజ్జి కన్నలను చూసేందుకు ఉవ్విళ్లూరుతుంది. కానీ మహమ్మారి డెంగీ.. ఆ తల్లితో పాటు గర్భంలోని ఇద్దరు ఆడబిడ్డల ఉసురు తీసింది.

వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని శాయంపేట మండలం గట్లకానిపర్తికి చెందిన 29 ఏళ్ల బొమ్మకంటి శిరీష నిండు గర్భిణి. స్కానింగ్‌లో చేసి గర్భంలో కవలలు ఉన్నారని చెప్పడంతో.. ఆమె ఎంతో మురిసిపోయింది. బేబీలు ఆరోగ్యంగా ఉండాలని అన్ని జాగ్రత్తలు పాటిస్తుంది. మరో వారం రోజుల్లో డెలవరీ అవ్వొచ్చని డాక్టర్లు చెప్పారు.  అంతలోనే శిరీష జ్వరం బారిన పడింది. బాగా నీరసించిపోవడంతో.. కుటుంబసభ్యులు నాలుగు రోజుల కిందట హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. టెస్టులు చేసిన డాక్టర్లు.. డెంగీ జ్వరంగా నిర్ధారించి.. చికిత్స మొదలుపెట్టారు. గురువారం ఉదయం ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో.. ఆమె పరిస్థితి విషమించింది. దీంతో గర్భంలోని కవలల్ని అయినా బతికించాలని డాక్టర్లు సిజేరియన్‌ చేశారు. కానీ విధి రాత అనుకుంటాను.. తల్లితో పాటు పిల్లలు కూడా మృతిచెందారు. భార్య, కవల బిడ్డలు కన్నుమూయడంతో భర్త శ్రీకాంత్‌ గుండెలవిసేలా రోదించాడు. కాగా ఆయన మొదటి భార్య..   కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో చనిపోవడంతో.. ఆమె పేరు మీద గ్రామంలో బస్టాండు నిర్మించి, అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2021లో ఆమె సోదరి శిరీషనే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆమె కూడా ఇలా నిండు గర్భిణిగా ఉన్న సమయంలో మరణించడంతో.. ఆ కుటుంబం ఆవేదన వర్ణించలేనంతగా ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..