10 Class Results: త్వరలో తెలంగాణ పదో తరగతి ఫలితాలు.. ఫార్మేటివ్ అసెస్‌మెంట్(ఎఫ్ఏ-1) ఆధారంగా గ్రేడ్లు

|

May 18, 2021 | 10:30 PM

10 Class Results: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు రెండు మూడురోజుల్లోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కారణంగా వరుసగా రెండో ఏడాది పదో తరగతి పరీక్షలు

10 Class Results: త్వరలో తెలంగాణ పదో తరగతి ఫలితాలు.. ఫార్మేటివ్ అసెస్‌మెంట్(ఎఫ్ఏ-1) ఆధారంగా గ్రేడ్లు
Follow us on

10 Class Results: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు రెండు మూడురోజుల్లోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కారణంగా వరుసగా రెండో ఏడాది పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం.. ఫార్మేటివ్ అసెస్‌మెంట్(ఎఫ్ఏ-1) ఆధారంగా గ్రేడ్లను కేటాయిస్తున్నారు. పరీక్ష ఫీజు చెల్లించిన 5,21,398 మంది విద్యార్థుల ఫలితాలను రెండు మూడు రోజుల్లో వెలువడనున్నాయి.

కోవిడ్‌ కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు హాట్ టికెట్ నంబర్లు కేటాయించింది. ఫార్మేటివ్‌ అసెస్మెంట్‌(ఎఫ్ఏ-1) మార్కుల ఆధారంగా వార్షిక పరీక్షల మార్కులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కుల మెమోలో హాల్‌టికెట్‌ నంబర్‌ను కూడా నమోదు చేస్తారు. గత సంవత్సరం నాలుగు ఎఫ్‌ఏ పరీక్షల సగటు ఆధారంగా పదో తరగతి పరీక్ష ఫలితాలు ప్రకటించగా, ఈసారి మాత్రం ఒక్క ఎఫ్‌ఏ ఆధారంగానే వార్షిక పరీక్ష మార్కులు కేటాయించనున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత నెలాఖరులోగా మెమోలు విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవీ కూడా చదవండి

Telangana Lockdown: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. లాక్‌డౌన్‌ను పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..

CBSE 12th Board Exam: సీబీఎస్‌ఈ 12 బోర్డు పరీక్ష రద్ధుపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు