Khammam District: ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో హైటెన్షన్ నెలకొంది. తుమ్మల ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్యను ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపారు. బైక్‌పై వెళ్తుండగా.. గ్రామ శివార్లలో ఆటోతో ఢీకొట్టారు. తమ్మినేని కృష్ణయ్య బైక్‌పైనుంచి కిందపడిపోయిన వెంటనే.. వేట కొడవళ్లతో నరికి చంపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి వరుసకు సోదరుడు అవుతాడు కృష్ణయ్య. గతంలో సీపీఎంలో పనిచేశారాయన. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు ప్రధాన అనుచరుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెల్దారుపల్లిలో ఆధిపత్యపోరే ఈ దారుణ హత్యకు కారణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరభద్రం ఓన్ బ్రదర్స్‌తో కృష్ణయ్యకు విభేదాలు ఉన్నాయని స్థానికులు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణయ్య వర్గీయులు.. తమ్మినేని కోటేశ్వరరావు ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. తెల్దారుపల్లిలో తమ్మినేని కృష్ణయ్య హత్య.. తమ్మినేని కోటేశ్వర్‌రావు ఇంటిపై దాడితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు మోహరించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..