Telangana: అతి త్వరలో కాంగ్రెస్‌లో YSRTP విలీనం.. లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవే

YSRTP-Congress merger: ఎన్నో మలుపుల తర్వాత కాంగ్రెస్‌లో YSRTP విలీనానికి అధిష్టానం పచ్చజెండా ఊపింది. కాంగ్రెస్‌ పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు రంగంలోకి దిగి వైఎస్‌ షర్మిలతో చర్చలు జరిపారు. దీంతో అతి త్వరలో కాంగ్రెస్‌లో YSRTP విలీనం కానుంది. తాజాగా సునీల్‌ కనుగోలు రంగంలోకి దిగి చర్చలు జరిపి కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీన ప్రక్రియకు మార్గం సుగమం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి

Telangana: అతి త్వరలో కాంగ్రెస్‌లో YSRTP విలీనం.. లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవే
YS Sharmila

Edited By:

Updated on: Sep 30, 2023 | 10:18 PM

కాంగ్రెస్ పార్టీలో YSRTP విలీనంపై చర్చలు తుది దశకు చేరుకున్నాయి. విలీనంపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. దీనికోసం కాంగ్రెస్‌ పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు రంగంలోకి దిగారు. వైఎస్‌ షర్మిలతో ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆదివారం నాడు వైఎస్‌ షర్మిల ఢిల్లీ వెళ్లనున్నారని చెబుతున్నారు. హస్తినలో కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీని షర్మిల కలుస్తారు. ఆదివారం లేదా సోమవారం సోనియా, రాహుల్‌ సమక్షంలో వైఎస్‌ షర్మిల…తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారు. ఇక రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు షర్మిలకు కాంగ్రెస్‌ అధిష్టానం అవకాశం ఇవ్వలేదని చెబుతున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ సీటును షర్మిలకు కాంగ్రెస్ ఆఫర్ చేసినట్లు సమాచారం. అందుకు వైయస్ షర్మిల కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అంతకుముందు కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనం వ్యవహారం చాలా మలుపులు తిరిగింది. ఆమధ్య ఢిల్లీ వెళ్లిన షర్మిల…సోనియా, రాహుల్‌ని కలిసి వచ్చారు. అంతకుముందు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ద్వారా ఆమె కాంగ్రెస్‌ అధిష్టానానికి చేరువయ్యారు. అయితే కాంగ్రెస్‌లో ఆమె పార్టీ విలీనం కొన్ని రోజులు ముందుకు సాగి…తర్వాత ఆగి అన్నట్లు జరిగింది.

షర్మిల ఎంట్రీని టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి వ్యతిరేకించిన నేపథ్యంలో కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనానికి కొన్నాళ్లు బ్రేకులు పడ్డాయి. ఆ నేపథ్యంలో సెప్టెంబర్‌ నెలాఖరు కల్లా విలీనం ప్రక్రియ జరగకపోతే తన దారి తాను చూసుకుంటానని షర్మిల తెగేసి చెప్పారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ సీట్లలో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. తాజాగా సునీల్‌ కనుగోలు రంగంలోకి దిగి చర్చలు జరిపి కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీన ప్రక్రియకు మార్గం సుగమం చేశారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి.