Suryapet: తమ తండ్రి గుర్తుగా కొడుకులు ఏం చేశారంటే..

అడ్డాలనాడు బిడ్డలు.. కానీ గడ్డాల నాడు బిడ్డలు కాదన్న నానుడి నిజమవుతోంది. ఉన్న ఆస్తిని కాజేసి, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను సాకలేక కొందరు.. రోడ్డుపైకి గెంటేస్తున్నారు. కొందరు మాత్రం జన్మనిచ్చి, విద్యా బుద్ధులు నేర్పించి ఉన్నతికి శ్రమించిన తల్లిదండ్రుల విలువను వదులుకోవడం లేదు. భౌతికంగా దూరమైనా ఆ జ్ఞాపకాలను అలాగే నెమర వేసుకుంటున్నారు. నాలుగు కాలాలపాటు తమ తల్లిదండ్రులను లోకం గుర్తుంచుకునేలా చేస్తున్న కొడుకులూ కొందరున్నారు.

Suryapet: తమ తండ్రి గుర్తుగా కొడుకులు ఏం చేశారంటే..
Gundu Abbayya Statue

Edited By:

Updated on: Sep 12, 2025 | 11:38 AM

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం గట్టికల్ గ్రామానికి చెందిన గుండు అబ్బయ్యది కూలి నాలి చేసుకునే కుటుంబం. ఉన్నంతలో పిల్లలను పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశాడు. అభ్యుదయ భావాలు కలిగిన అబ్బయ్య గ్రామంలో సిపిఎం నేతగా ఎదిగారు. ఏడాది క్రితం అబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. కనిపెంచిన తండ్రి విలువను అబ్బయ్య ఇద్దరు కొడుకులు వదులుకోలేదు. తమకు జన్మనిచ్చి, విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతికి శ్రమించిన తల్లిదండ్రులను దైవంగా భావించారు.

తమ నుంచి తండ్రి దూరమై ఏడాదైనా ఆ జ్ఞాపకాలను కొడుకులు గుండు లింగయ్య, గుండు రమేష్.. అలాగే నెమరవేసుకున్నారు. తండ్రి జ్ఞాపకార్థం కుమారులు అబ్బయ్య విగ్రహాన్ని తయారు చేయించారు. తండ్రి ప్రథమ వర్ధంతి సందర్భంగా అబ్బయ్య విగ్రహాన్ని తమ వ్యవసాయ క్షేత్రంలో ఆవిష్కరించుకుని ప్రేమను చాటుకున్నారు. తమ తండ్రి నేర్పిన విలువలను నాలుగు కాలాల పాటు లోకం గుర్తుంచుకునేలా విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు కొడుకులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us