తెలంగాణ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. గవర్నర్ కోటాలో కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ నియామకం జరగగా.. ఈ కేసులో తాజా తీర్పు వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో 2024 ఆగస్టు 14నే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

తెలంగాణ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Telangana Governor Quota Mlc Election

Edited By: Balaraju Goud

Updated on: Aug 13, 2025 | 6:05 PM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. గవర్నర్ కోటాలో కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ నియామకం జరగగా.. ఈ కేసులో తాజా తీర్పు వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో 2024 ఆగస్టు 14నే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో, తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట దక్కింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టేటస్ కో విధించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోరగా.. గవర్నర్ నామినేట్ చేయడాన్ని తాము అడ్డుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఎమ్మెల్సీలను ఎప్పటికప్పుడు నియామకాల చేపట్టడమన్నది ప్రభుత్వ విధి అని, అప్పటి తన తీర్పులో పేర్కొంది సుప్రీం. గత ప్రభుత్వం నియమించిన తమను కాదని కొత్త ప్రభుత్వం ఎమ్మెల్సీలను నియామకం చేపట్టడంపై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, కుర్ర సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని నిలుపుదల చేయాలని పిటీషన్ లో కోరారు. కొత్త ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలని కోరారు. అయితే స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ప్రభుత్వం, గవర్నర్‌ ఎలాంటి చర్యలు తీసుకున్నా, సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..