బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహనకు పింక్ పవర్ రన్.. 2024 తొలి ఎడిషన్ ఎప్పుడంటే..?
కఠినమైన సమయంలో పోరాడుతున్న తోటి మహిళలకు అండగా నిలిచింది సుధా రెడ్డి పౌండేషన్. క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన మహిళా యోధులకు మద్దతునిచ్చేందుకు ఆడవాళ్లందరినీ ఒకచోట చేర్చే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది.
కఠినమైన సమయంలో పోరాడుతున్న తోటి మహిళలకు అండగా నిలిచింది సుధా రెడ్డి పౌండేషన్. క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన మహిళా యోధులకు మద్దతునిచ్చేందుకు ఆడవాళ్లందరినీ ఒకచోట చేర్చే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. బ్రెస్ట్ క్యాన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌కు చెందిన సుధా రెడ్డి ఫౌండేషన్, meil ఫౌండేషన్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పింక్ పవర్ రన్-2024 తొలి ఎడిషన్ సెప్టెంబర్ 29న ఉదయం 5 గంటలకు ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన కీలక ప్రెస్ మీట్‌ను హైదరాబాద్‌లోని మై హోం నవద్వీపాలోని ఆవాసా హోటల్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుధారెడ్డి ఫౌండేషన్ ఫౌండర్ సుధా రెడ్డి, డాక్టర్ సుధా సిన్హా, బాడ్మింటన్ స్టార్ పివి సింధు పాల్గొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే నివారించడం సాధ్యమని, సరైన అవగాహన లేకపోవడం వల్లే మహిళలు మృత్యువాత పడుతున్నారని వక్తలు అభిప్రాయపడ్డారు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే ఈ పింక్ పవర్ రన్‌ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. తొలి ఎడిషన్‌లో భాగంగా 3k, 5k, 10k రన్ నిర్వహించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ సందర్భంగా పింక్ పవర్ రన్ కోసం టీ షర్ట్, మెడల్‌ను ఆవిష్కరించారు.