Inspiring Story: యువతకు స్ఫూర్తి ఆమె.. చిన్నతనంలో కాళ్ళు కోల్పోయినా సివిల్స్ క్లియర్ చేసింది.. వందలాది మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తూ..

|

Mar 10, 2023 | 11:59 AM

బాలలత మల్లవరపు 11 నెలల వయసు ఉన్న సమయంలో పోలియో చుక్కల ప్రభావంతో కాళ్లు కోల్పోయింది. శారీరక వైకల్యం కారణంగా చిన్నతనంలో పాఠశాలకు వెళ్లలేకపోయింది. అయితే బాలలత తల్లిదండ్రులు ఓ వైపు మెరుగైన చికిత్స అందిస్తూనే.. మరోవైపు ఇంట్లోనే చదువుకు బీజం చేశారు. బాల లత తండ్రి, జర్నలిస్ట్. తన కూతురుకి ఇంట్లో చదువుకు నేర్పించారు.

Inspiring Story: యువతకు స్ఫూర్తి ఆమె.. చిన్నతనంలో కాళ్ళు కోల్పోయినా సివిల్స్ క్లియర్ చేసింది.. వందలాది మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తూ..
Balalatha Mallavarapu
Follow us on

ఎందరి యువతకో స్ఫూర్తి ఈ మహిళ. 11 నెలల వయసు ఉన్న సమయంలో పోలియో చుక్కల ప్రభావంతో కాళ్లు కోల్పోయింది. శారీరక వైకల్యం వలన స్కూల్ కు కూడా వెళ్లలేకపోయింది. అయినప్పటికీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంట్లోనే అక్షరాలు దిద్దింది. తాను ఉన్నత విద్యను అభ్యసించడమే కాదు.. ప్రస్తుతం సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శిక్షణ ఇస్తూ.. వందలాది మందికి మార్గదర్శకంగా నిలుస్తుంది. గత సంవత్సరం హైదరాబాద్ నుండి 15 మంది అభ్యర్థులు UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. నేటి తరానికి స్ఫూర్తిని ఇచ్చే బాలలత మల్లవరపు గురించి తెలుసుకుందాం..

బాలలత మల్లవరపు 11 నెలల వయసు ఉన్న సమయంలో పోలియో చుక్కల ప్రభావంతో కాళ్లు కోల్పోయింది. శారీరక వైకల్యం కారణంగా చిన్నతనంలో పాఠశాలకు వెళ్లలేకపోయింది. అయితే బాలలత తల్లిదండ్రులు ఓ వైపు మెరుగైన చికిత్స అందిస్తూనే.. మరోవైపు ఇంట్లోనే చదువుకు బీజం చేశారు. బాల లత తండ్రి, జర్నలిస్ట్. తన కూతురుకి ఇంట్లో చదువుకు నేర్పించారు.  10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలను ప్రైవేట్ గా రాసి క్లియర్ చేసింది. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో దూరవిద్యలో ఉన్నత విద్యను అభ్యసించింది.

బాలలత గ్రాడ్యుయేషన్ తర్వాత.. తన జీవితాన్ని ముగించాలని అనుకున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఆమె జీవితంలో ఒక మలుపు తిరిగింది.  కృషి, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపించింది. 2004, 2016లో బాలలత UPSC సివిల్ సర్వీస్ పరీక్షలకు వెళ్ళింది. రెండు సార్లు ఉత్తీర్ణులయింది. అప్పుడు తానే ఎందుకు సివిల్స్ కు ప్రిపేర్ అయ్యేవారికి ఎందుకు శిక్షణ ఇవ్వకూడదు అని ఆలోచించింది. అలా 2005 లో సివిల్స్ అభ్యర్థులకు శిక్షణనిస్తూ ముందుకు సాగింది. మరోవైపు 2006 నుండి 2018 వరకు డిఫెన్స్ మంత్రిత్వ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా కూడా పనిచేసింది.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు బాలలత మార్గదర్శకత్వం, శిక్షణలో వందలాది మంది UPSC ఔత్సాహికులు సివిల్ సర్వీసెస్ పరీక్షలను విజయవంతంగా ఛేదించారు. ఇప్పుడు దేశానికి సేవ చేస్తున్నారు. 12 సంవత్సరాల పాటు బ్యూరోక్రాట్‌గా దేశానికి సేవ చేసిన బాలలత UPSC ఆశావహులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవడానికి, ఆశావాదుల మానసిక స్థితిని అనుభూతి చెందడానికి బాలలత రెండవసారి UPSCని ప్రయత్నించింది.

తన అనుభవంతో UPSC సివిల్ సర్వీస్ పరీక్షలకు రెడీ అవుతున్న అభ్యర్థులకు శిక్షణ ఇస్తుంది. అంతేకాదు ఎవరైనా సరే కలలుకన్నట్లు అయితే.. దానిని ఎవరైనా సాధించగలరు అని చెబుతోంది. తన జీవితం జాతికి ముఖ్యంగా యువతరానికి సేవ చేయడానికే అంకితం చేశాను అని చెబుతుంది

బాలలత పూర్వ విద్యార్థి  ప్రస్తుతం అలెప్పి జిల్లా కలెక్టర్‌గా ఉన్న కృష్ణ తేజ సహా అనేక మంది సివిల్స్ క్రాక్ చేశారు. ఆమె వివిధ కళాశాలల్లో తన ప్రసంగాల ద్వారా సుమారు 30,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..