Exam dates: ఎగ్జామ్ డేట్సే ఓ పరీక్ష.. సెట్ అవ్వని తేదీలు.. అయోమయంలో విద్యార్థులు

|

Apr 02, 2022 | 12:48 PM

కరోనా కారణంగా విద్యార్థులకు ప్రత్యక్ష బోధన దూరమైంది. ఆన్ లైన్(Online) విధానంలో తరగతులు జరిగినా అవి అనుకున్నంత సత్ఫలితాలు ఇవ్వలేదు. అసలే అంతంత మాత్రంగా క్లాసులు జరుగుతున్నాయనుకుంటే ఎగ్జామ్స్...

Exam dates: ఎగ్జామ్ డేట్సే ఓ పరీక్ష.. సెట్ అవ్వని తేదీలు.. అయోమయంలో విద్యార్థులు
Inter Exams
Follow us on

కరోనా కారణంగా విద్యార్థులకు ప్రత్యక్ష బోధన దూరమైంది. ఆన్ లైన్(Online) విధానంలో తరగతులు జరిగినా అవి అనుకున్నంత సత్ఫలితాలు ఇవ్వలేదు. అసలే అంతంత మాత్రంగా క్లాసులు జరుగుతున్నాయనుకుంటే ఎగ్జామ్స్ నిర్వహించడంలోనూ ప్రభుత్వం అదే ధోరణి కొనసాగిస్తోంది. పరీక్షల తేదీలను ప్రకటించడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. అయితే ఇప్పటి వరకు టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్(Exams Schedule) షెడ్యూల్ ఇవ్వగా.. చివరకు 1 నుంచి 9 వరకు రాసే పరీక్షల టైం టేబుల్ కూడా మార్చాల్సిన పరిస్థితి నెలకొంది. ఇన్ని గందరగోళాల మధ్య విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. ఏప్రిల్ 20 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ఉంటాయని ప్రభుత్వం తేదీలు ప్రకటించింది. ఆ తర్వాత జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈ తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(National Testing Agency) విడుదల చేయడంతో కొన్ని డేట్స్ క్రాష్ అయ్యాయి. చేసేదేమి లేక ఇంటర్ బోర్డు తేదీలను మారుస్తు కొత్త షెడ్యూల్ ఇచ్చింది. ఈ సారి పరీక్ష తేదీలను అడ్జెస్ట్ చేస్తూ.. ఏప్రిల్ 22 నుంచి మే 7 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు చెప్పింది. అయితే మళ్లీ ఎన్టీఏ కొందరు విద్యార్థుల అభ్యర్థనల మేరకు జేఈఈ పరీక్షల తేదీలను మారుస్తూ రీషెడ్యూల్ చేసింది. ఏప్రిల్ 21,24,25,29, మే 1,4 తేదీల జేఈఈ తొలివిడత పరీక్షలు జరగనున్నాయి. ఇవి కూడా ఇంటర్ పరీక్షల తేదీలతో క్లాష్ అవుతుండటంతో రెండోసారి ఇంటర్ షెడ్యూల్ ఛేంజ్ చేయక తప్పలేదు. ఈ చిక్కులన్ని ఎందుకు అనుకున్న ఇంటర్ బోర్డు జేఈఈ పరీక్షలు లేని మే 6 నుంచి మే 19 వరకు ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ నిర్వహించేలా షెడ్యూల్ ఇచ్చింది.

ఇంటరే కాదు పదో తరగతి పరీక్షలపైనా షెడ్యూల్ ప్రభావం తప్పలేదు. తొలుత టెన్త్ ఎగ్జామ్స్ మే 11 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇంటర్ షెడ్యూల్ మారడంతో పరీక్షా కేంద్రాల సర్దుబాటు సహా ఇతరత్ర కారణాలతో ఆ తేదీలను మార్చక తప్పలేదు. దీంతో మే 23 నుంచి 28 వరకు టెన్త్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. అనివార్య కారణాలతోనే రీ-షెడ్యూల్ చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. అయితే మే నెలలో మాడు పగిలే ఎండల్లో విద్యార్థులకు పరీక్షల నిర్వహణపై పేరెంట్స్ అసోషియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏప్రిల్ లోనే పెట్టాలని వినతి పత్రాలు అందజేసినా ప్రభుత్వం స్పందించలేదు.

ఎంసెట్, ఈసెట్ సహా మిగిలిన అన్ని ఎంట్రెన్స్ టెస్టుల ఎగ్జామ్స్ కాస్త ఇబ్బంది లేకుండానే డేట్స్ ఎనౌన్స్ చేశారు. జులై నెల మొత్తం ఎంట్రెన్స్ టెస్టులతో నిండిపోయింది. జులై 14,15 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్, జులై 18,19,20 తేదీల్లో ఇంజినీరింగ్ ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈసెట్ జులై 13న జరగనుంది. జులై 21,22న లా సెట్, జులై 22న పీజీఎల్ సెట్, జులై 26,27న ఎడ్ సెట్, 27,28 న ఐసెట్, జులై 29 నుంచి ఆగస్టు 1వరకు పీజీఈ సెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

ఇంతవరకు బానే ఉన్నా చివరకు 1 నుంచి 9 తరగతులకు నిర్వహించే సమ్మెటివ్ అసెస్ మెట్ -ఎస్ఏ2 పరీక్షల షెడ్యూల్ కూడా మార్చాల్సి వచ్చింది. వారం రోజుల్లో పరీక్షలు అంటూ ఏప్రిల్ 7 నుంచి ఎగ్జామ్స్ నిర్వహణకు ఎస్‌సీఈఆర్టీ షెడ్యూల్ ఇచ్చింది. వారం రోజుల్లో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని.. విద్యార్థులకు కూడా టైం ఇవ్వలేదని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మరుసటి రీషెడ్యూల్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 16 నుంచి 22 వరకు ఎస్ఏ-2 పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. ఈ ఏడాది అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 23వ తేది చివరి వర్కింగ్ డే.

Also Read

Tirumala: ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం జగన్‌కు అధికారం శాశ్వతంగా ఉండాలంటున్న ఎమ్మెల్యే

Sikalahasti: శ్రీకాళహస్తి లో క్షుద్ర పూజలు.. అర్ధరాత్రి వేళల్లో తాంత్రిక మంత్రాలు

Viral Video: వారెవ్వా..! వయసు ఎనిమిదేళ్లే.. సంపాదన మాత్రం వందల కోట్లు..! ఎలానో తెలుసా..?