Covid Patients: తెలంగాణలోకి వస్తున్న కోవిడ్ పేషేంట్స్‌పై కఠిన నిబంధనలు.. ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మేషన్ ఉంటేనే అనుమతి..!

|

May 11, 2021 | 7:42 AM

మెరుగైన వైద్యంకోసం ఇతర రాష్ర్టాల నుంచి కరోనా బాధితులు పెద్దసంఖ్యలో తెలంగాణకు తరలివస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. రెండో రోజు కూడా సరిహద్దుల్లో గట్టి నిఘా ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Covid Patients: తెలంగాణలోకి వస్తున్న కోవిడ్ పేషేంట్స్‌పై కఠిన నిబంధనలు.. ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మేషన్ ఉంటేనే అనుమతి..!
Strict Regulations On Covid Patients Permission To Telangana
Follow us on

Covid Patients Permission to Telangana: మెరుగైన వైద్యంకోసం ఇతర రాష్ర్టాల నుంచి కరోనా బాధితులు పెద్దసంఖ్యలో తెలంగాణకు తరలివస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. రెండో రోజు కూడా సరిహద్దుల్లో గట్టి నిఘా ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు కరోనా బాధితులను తరలిస్తున్న అంబులెన్స్‌లను పోలీసులు సరిహద్దుల్లో అడ్డుకుంటున్నారు. ఇదే క్రమంలో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దుతోపాటు కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద తెలంగాణ పోలీసులు నిశితంగా తనిఖీలు చేపడుతున్నారు.

తెలంగాణలోకి వస్తున్న కోవిడ్ పేషేంట్స్ అనుమతిపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. తెలంగాణలో ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మేషన్, ఆసుపత్రి నుంచి అనుమతి ఉంటేనే అంబులెన్సులకు అనుమతి ఇస్తామని రాష్ట్ర పోలీసులు తేల్చి చెబుతున్నారు. ఆసుపత్రుల అనుమతి లేకుండా కరోనా పేషేంట్ తో వస్తున్న అంబులెన్స్ తిరిగి వెనక్కు పంపిస్తున్నారు. సాధారణ ప్రయాణికులను మాత్రం అనుమతిస్తున్న తెలంగాణ పోలీసులు చెప్పారు.

ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో నిత్యం 15 వేలకు చేరువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో కర్నూ లు, అనంతపురం, కడప జిల్లాల నుంచి చాలామంది తెలంగాణలో చికిత్సకోసం తరలివస్తున్నారు. దీంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఆసుపత్రులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తెలంగాణకు వస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గుర్తించారు. దీంతో రాష్ట్రంలోని కరోనా బాధితులకు సరియైన వసతులు కల్పించలేకపోతున్నామని ప్రభుత్వం భావిస్తోంది. ఆ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిపై నిఘా పెడుతున్నట్లు అధికారులు తెలిపారు.

Read Also…  Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్.? 15 నుంచి పెట్టే అవకాశం.!! నేడే సర్కార్ కీలక నిర్ణయం..