Telangana: వింత మేకపిల్ల జననం.. రెండు కళ్లు ఉన్నా కానీ

|

May 08, 2022 | 8:17 PM

రైతు హరిజన్‌ మొగులప్పకు చెందిన మేక శనివారం వింత మేక పిల్లకు జన్మనివ్వగా.. మేకపిల్లకు రెండు కళ్లు ఉన్నా.. కనుగుడ్లు మాత్రం నుదుటిపై రెండూ ఒకే చోట ఉన్నాయి.

Telangana: వింత మేకపిల్ల జననం.. రెండు కళ్లు ఉన్నా కానీ
Strange Sheep
Follow us on

Viral Video: ప్రపంచంలో ప్రకృతికి విరుద్ధంగా ఆవు పంది పిల్లకు పాలు ఇవ్వడం, కుక్క.. పిల్లి స్నేహం, మేకకు మనిషి రూపంలో పిల్ల జన్మించడం సహా అనేక వింత సంఘటనలు గురించి తరచుగా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా గత కొద్ది కాలంగా సోషల్ మీడియా(Social media) ద్వారా అకానేనక వింత సంఘటనల గురించి ప్రపంచానికి తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా పలు ప్రాంతాలలో మేక పిల్లలు వింతవింతగా జన్మించాయనే వార్తలు తరచుగా వింటున్నాం.. తాజాగా వికారాబాద్‌ జిల్లా(Vikarabad district) బిచ్చాల గ్రామంలోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ మేకకు వింత మేకపిల్ల జన్మించింది. బిచ్చాల్‌ గ్రామంలోని రైతు హరిజన్‌ మొగులప్పకు పెంచుతున్న ఓ మేక వింత మేక పిల్లకు జన్మనిచ్చింది. ఈ మేకపిల్లకు రెండు కళ్లు ఉన్నా.. కనుగుడ్లు మాత్రం నుదుటిపై రెండూ ఒకే చోట ఉన్నాయి. దీంతో రైతు ఇలా మేకపిల్ల జన్మించడం తనకు అదృష్టమని చెబుతున్నాడు. అయితే, ఈ వింతను చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విధంగా వింతలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే జన్యు పరమైన సమస్యలతో మేకపిల్ల ఇలా జన్మించి ఉండవచ్చని పశువైద్యులు చెబుతున్నారు.  ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

Also Read: East Godavari: పిడుగు పడి నిట్టనిలువునా కాలిపోయిన కొబ్బరి చెట్టు.. వీడియో చూడండి..