Sriram Sagar Project: నిరుడు ఉత్తర తెలంగాణ వరదాయినికి జలకల.. నేడు ఎడారి..ఆందోళనలో అన్నదాతలు

| Edited By: Surya Kala

Jul 15, 2023 | 1:21 PM

ఉత్తర తెలంగాణ జిల్లాలకు వర ప్రదాయినిగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం పడిపోయింది. వర్షాలు లేకపోవడంతో ఎగువ నుంచి ఎస్సారెస్పీలోకి ఇన్‌ఫో లేదు. నిల్వ ఉన్నది 23 టీఎంసీలు మాత్రమే. శ్రీరాంసాగర్ ప్రొజెక్టులోకి కేవ‌లం స్వ‌ల్ప నీటి ప్రవాహం మాత్ర‌మే కోన‌సాగుతుంది.. మహారాష్ట్ర నుండి రావ‌ల్సిన‌ వరద పూర్తిగా త‌గ్గిపోవ‌డంతో డెడ్ స్టోరేజికి చేరువ‌లో ఉంది శ్రీరాం సాగ‌ర్..

Sriram Sagar Project: నిరుడు ఉత్తర తెలంగాణ వరదాయినికి జలకల.. నేడు ఎడారి..ఆందోళనలో అన్నదాతలు
Sri Ram Sagar Project
Follow us on

నాడు గోదారి… నేడు ఏడారి…గ‌త ఏడాది మ‌హోగ్రరూపం దాల్చిన శ్రీరాం సాగ‌ర్ నేడు మౌనరాగాన్ని  ఎంచుకుంది…గ‌తేడాది ఇదే రోజున భారి వ‌ర‌ద తో 34 గేట్లు ఏత్తి పారించిన నీళ్ల ద‌గ్గ‌ర ఇప్పుడు నిర్మానుష్యం క‌నిపిస్తుంది.. 600 టిఎంసిల‌కు పైగా నీళ్ల‌ను గోద‌వరిలోకి వ‌దిలిన ఎస్సారేస్పి ఇప్పుడు కనీసం సాగుకు కూడ నీరందివ్వ‌ని దీన స్థితికి చేరుకుంది… ఉత్తర తెలంగాణ జిల్లాలకు వర ప్రదాయినిగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం పడిపోయింది. వర్షాలు లేకపోవడంతో ఎగువ నుంచి ఎస్సారెస్పీలోకి ఇన్‌ఫో లేదు. నిల్వ ఉన్నది 23 టీఎంసీలు మాత్రమే. శ్రీరాంసాగర్ ప్రొజెక్టులోకి కేవ‌లం స్వ‌ల్ప నీటి ప్రవాహం మాత్ర‌మే కోన‌సాగుతుంది.. మహారాష్ట్ర నుండి రావ‌ల్సిన‌ వరద పూర్తిగా త‌గ్గిపోవ‌డంతో డెడ్ స్టోరేజికి చేరువ‌లో ఉంది శ్రీరాం సాగ‌ర్… ప్ర‌స్తుతం ఎస్సారేస్పికి ఇన్ ఫ్లో 12623 క్యూసెక్కులు వ‌స్తుండ‌టంతో ఔట్ ఫ్లో 878 క్యూసెక్కులు ఉంది. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1067 ఉంది… నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23 టీఎంసీలు ఉంది…కాగా గత సంవత్సరం ఇదే రోజున ఎస్సారెస్పీ నీటి మట్టం 1087అడుగులుగా ఉండి 74 టీఎంసీల తో ప్రాజెక్ట్ నిండు కుండ‌ను త‌లపించింది….

మ‌హ‌రాష్ట్ర లో వ‌ర్ష‌బావ ప‌రిస్థితులే కార‌ణం

మ‌హ‌రాష్ట్ర లో వ‌ర్షాభావ పరిస్థితులు దీనికి ప్ర‌దాన కార‌ణంగా క‌నిపిస్తున్నాయి… మహారాష్ట్రతో పాటు, ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిస్తే ఈ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కానీ ఈ ఏడాది ప్రాజెక్టు ఆయకట్టు లో సరిగ్గా వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండ లేదు. గ‌త ఏడాది లో వచ్చిన వరద కొంత మేరకు ఊరటనిచ్చింది. ఒక్కోరోజు సుమారు 4లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. అప్పుడు కోద్ది రోజుల పాటు లక్ష క్యూసెక్కల ఇన్ ప్లో వ‌చ్చింది… ఈ సంవ‌త్స‌రం మొత్తానికి 74 టిఎంసిల మేర జ‌లాలు చేరాయి… దీంతో 90 టీఎంసీల క్యాప‌సిటి ఉన్నాఎస్సారేస్పి కి మ్యాక్సిమ‌మ్ 76 టీఎంసీలకు చేరింది. కాగా ఈ సంవ‌త్స‌రం ఫిబ్రవరిలో యాసంగి పంటల కోసం కాకతీయ కాలువ నుండి సాగు నీటిని విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి

గ‌తేడాది గంభీరం- ఇప్పుడు నిశ‌బ్దం

ఇక గ‌త ఏడాది ప్రాజెక్ట్ 42 గెట్ల‌ల‌లో 34 గేట్లు ఏత్త‌డంతో ప‌ర్య‌ట‌క శోభ సంత‌రించుకుంది…కాని ఈ ఏడాది మాత్రం నిశ‌బ్ద వాత‌వ‌ర‌ణం కనిపిస్తుంది ప్రాజెక్ట్ గెట్ల ద‌గ్గ‌ర… ప్రాజెక్ట్ ఆయ‌క‌ట్టు అంత బోసిపోయి క‌నిపిస్తుంది.. ఒక్క గేటు కూడ ఈ ఏడాది ఏత్తే అవ‌కాశం లేక‌పోవ‌డంతో రైతులు నిరాశ చేందుతున్నారు.. గ‌తేడాది రైతుల క‌ళ్ల లో ఆనందం చూసిన శ్రీరాం సాగ‌ర్ ఇప్పుడు మాత్ర‌మే ఎదరు చూపుల‌తో కాల‌యాపాన చేస్తుందిను. కేవ‌లం 23 టిఎంసిల డేడ్ స్టోరేజి స‌మీపంలోకి రావ‌డం ఆశ్య‌ర్యానికి గురి చేస్తుంది.

దిగువ మానేరు డ్యాం ఎగువన సుమారు ఆరున్న లక్షల ఎకరాల సాగుకు 50 టీఎంసీలు సాగు నీరు అవసరం. అయితే వర్షాభావ పరిస్థితులతో పంటల సాగు ఆలస్యమవుతోంది. ఈ సీజన్‌లో రైతులకు కాల్వలు, ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేసేందుకు.. గడువు కూడా ఎంతో దూరంలో లేక‌పోవ‌డంతో ఇప్పుడు కాళేశ్వ‌రం నుండి ఏత్తిపోస్తున్న నీటిపైనే రైతులు ఆశ‌లు పెట్టుకున్నారు.. దీనివల్ల సాగునీటి ఇక్కట్లు తప్పుతాయని బావించిన స‌ర్కార్.. మోటార్ల ద్వారా ఎస్సారెస్పీకి నీళ్లను నిజామాబాద్ జిల్లా ముప్కాల్ వద్ద నిర్మించిన పంప్‌హౌజ్​​ ద్వారా నేరుగా ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోస్తున్నారు…దీనితో రోజుకు 1 టిఎంసి నీళ్లు వ‌చ్చి చేరుతున్నాయి..దీని కోసం ముప్కాల్ పంపుహౌజ్‌​లో 6.5 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న ఎనిమిది చొప్పున మోటార్లు బిగించారు. వీటిని ఒక రోజు నడిపితే 1 టీఎంసీ నీటిని ఎస్సారెస్పీకి తరలించొచ్చు…ఇది రైతుల‌కు వ‌ర ప్ర‌దాయ‌ని అంటున్నారు రైతులు… ఇక ఇప్పుడు వ‌ర్ష‌పాతం న‌మోదు అవక‌పోతే సాగు నీరు ఇవ్వ‌డం క‌ష్ట‌మ‌నే బావ‌న‌లో అధికారులు ఉండ‌టంతో ఆందోళ‌న‌లో ఉన్నారు రైతులు

ఇప్పుడున్న పరిస్థితుల్లో సాగునీరు ఇవ్వ‌లేం- చ‌క్ర‌పాణి

ఇక మ‌హ‌రాష్ట్ర లో వర్ష‌బావ పరిస్థితుల‌తో శ్రీరాంసాగ‌ర్ డెడ్ స్టోరేజిని స‌మీపించింది అంటున్నారు ఎస్సారేస్పి అధికారులు.. ప్ర‌స్తుతం 23 టిఎంసి ల‌కు చేరువ‌లో ఉందంటున్నారు…సాగు నీటికి నీరు వ‌దలాలి అంటే కనీసం 30 టిఎంసిల నీళ్లు ఉండాలంటున్నారు అధికారులు… ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో 5 టిఎంసిల నీరు లోటు ఉందంటున్నారు… ఆగ‌స్టులోగా వ‌చ్చే అవ‌కాశం ఉందంటున్నారు….

ఇక గ‌త ఐదేళ్లుగా ప్రతి యేడు నిండుకుండ‌ల్ల ఉన్న శ్రీరాం సాగ‌ర్ ఇప్పుడు ఏడారిల మార‌డం పై అటు రైతులు ఇటు అన్న‌దాత‌లు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు…ఆగ‌స్టు వ‌ర‌కు మ‌ళ్లి ఎస్సారేస్పికి పునర్వైభ‌వం రావాలని కోరుతున్నారు.

మరిని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..