Telangana Turmeric Farmers : తెలంగాణ పసుపు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. రాష్ట్రంలో పసుపు పంట పండిస్తున్న రైతులకు రాయితీపై పసుపు పాలిషర్లు, బాయిలర్లను పంపిణీ చేయనున్నామని జాతీయ సుగంధ ద్రవ్యాల అభివృద్ధి సంస్థ – స్పైసెస్ బోర్డు ప్రాంతీయ ఉప సంచాలకులు డాక్టర్ జి. లింగప్ప వెల్లడించారు. ఓ ప్రకటనలో ఆయన ఈ వివరాలను విడుదల చేశారు.
పసుపు పంట సాగులో నాణ్యతా ప్రమాణాలు మరింత అభివృద్ధి చేసేందుకు ముందడుగు పడిందని ఆయన అభిప్రాయ పడ్డారు. సాగు, నాణ్యత పెంపునకు అవసరమైన యంత్రాలు, పసుపు ఉడకబెట్టేందుకు బాయిలర్లు.. ఆతర్వాత ఉపయోగించే పసుపు పాలీషర్లు వంటివాటిపై రాయితి ఇస్తున్నామని తెలిపారు. వీటిని షెల్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగల రైతు కుటుంబాలకు 75 శాతం సబ్సిడీ అందిస్తున్నారు. ఇక జనరల్ కేటగిరీ రైతులకు కూడా 50 శాతం మేర రాయితీపై వీటిని మంజూరు చేయనున్నట్లుగా తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ యత్రాలు కావాలనుకునే రైతులు హన్మకొండ హన్మకొండ స్పైసెస్ బోర్డు రీజినల్ కార్యాలయంలో నేరుగా సంప్రదించాలని కోరారు. తెలంగాణలో పసుపు రైతులు ఈ సదావకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని లింగప్ప సూచించారు.