తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం.. పిల్లల సంరక్షణకు ప్రత్యేక కోవిడ్ హెల్ప్ లైన్

|

Apr 19, 2021 | 5:45 PM

పిల్లల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పిల్లల సంరక్షణ సంస్థల కొరకు ప్రత్యేక కోవిడ్ హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది.

తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం.. పిల్లల సంరక్షణకు ప్రత్యేక కోవిడ్ హెల్ప్ లైన్
Covid-19
Follow us on

Covid Helpline for Children: తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్‌లో పిల్లలు సైతం వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పిల్లల సంరక్షణ సంస్థల కొరకు ప్రత్యేక కోవిడ్ హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది. పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఫిర్యాదులు , సలహాలు తీసుకునేందుకు ఈ హెల్ప్ లైన్ ఉపయోగపడనుంది. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రస్తుత కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి దృష్ట్యా పిల్లల సంరక్షణ సంస్థలకు అవసరమైన సహాయాన్ని అందించడానికి హెల్ప్ లైను ప్రారంభించింది.

పిల్లల సంరక్షణకు అవసరమైన సాయం అందించేందుకే ఈ కోవిడ్ హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని ప్రారంభించినట్లు మహిళా-శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ తెలిపారు. హెల్ప్ లైన్ నెంబర్ 040-23733665. అన్ని పని దినములలో ఉదయం 9గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉంటుందని ఆమె తెలిపారు.. ఈ హెల్ప్ లైన్ కోవిడ్ – 19 దృష్ట్యా పిల్లల సంరక్షణ సంస్థలకు తగు ముందు జాగ్రత్త చర్యలు మరియు సూచనలు చేయుటకు ఏర్పాటు చేశామన్నారు.

ఈ హెల్ప్ లైన్ ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి తగు మార్గదర్శకాలు అందజేస్తూ వారికి సహాయార్థం అందుబాటులో ఉంటుందని కమిషనర్ తెలిపారు. హెల్ప్ లైన్ ద్వారా పిల్లలను కోవిడ్ వైరస్ వ్యాప్తి నుంచి కాపడుటకు ఇతర భాగస్వామ్య సంస్థలతో సమన్వయం చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడుటకు నిర్దేశించిందన్నారు. ఈ హెల్ప్ లైన్ ద్వారా పిల్లల సంరక్షణ సంస్థలలో కోవిడ్ సోకిన పిల్లలకు సత్వర సహాయం అందించుటకు సహాయపడనున్నట్లు కమిషనర్ దివ్య దేవరాజన్ పేర్కొన్నారు.

Read Also… 

 Ayurvedic for Corona: ఆయుర్వేదంతో కరోనాకు చెక్.. అడ్డ సరం మొక్కతో తాజా ప్రయోగాలలో కీలక ముందడుగు

Hyderabad police dies : పోలీస్ డిపార్ట్మెంట్‌కి కరోనా కాటు, హైదరాబాద్‌లో కోవిడ్ సోకి ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ మృతి