TG Rain Alert: తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు.. ఇవాళ 16 జిల్లాల్లో కుండపోత! పిడుగులుపడే ఛాన్స్

|

Jun 12, 2024 | 9:24 AM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. వీటి ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రమంతటా మోస్తరు నంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధ, గురు, శుక్రవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రోజుల్లో ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఈదురుగాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని..

TG Rain Alert: తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు.. ఇవాళ 16 జిల్లాల్లో కుండపోత! పిడుగులుపడే ఛాన్స్
TG Rain Alert
Follow us on

హైదరాబాద్‌, జూన్‌ 12: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. వీటి ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రమంతటా మోస్తరు నంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధ, గురు, శుక్రవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రోజుల్లో ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఈదురుగాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొన్నది. బుధవారం 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కువరనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

మంగళవారం నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. బొమ్మలరామారంలో అత్యధికంగా 6.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావ్‌పేటలో 6.5 సెంటీ మీటర్లు, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడలో 6.5 సెంటీ మీటర్లు, మెదక్‌ జిల్లా ఎల్దుర్తిలో 6 సెంటీ మీటర్లు, తూప్రాన్‌ మండలం ఇస్లాంపూర్‌లో 5.8 సెంటీ మీటర్లు, శంకరంపేటలో 5.1 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.

భారీ వర్షాల కారణంగా పలు చోట్ల పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు సిద్దిపేట జిల్లాలో ఓ రైతు, మెదక్‌ జిల్లాలో ఓ మహిళ మృతి చెందారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం జప్తిలింగారెడ్డిపల్లికి చెందిన రైతు కడారి శ్రీశైలం (45) మంగళవారం సాయంత్రం పొలంలో పనిచేస్తుండగా వర్షం కురిసింది. దీంతో సమీపంలోని చెట్టు కిందకు వెళ్లగా.. అదే సమయంలో పిడుగుపడడంతో మృతి చెందాడు. మెదక్‌ జిల్లా చిలప్‌చెడ్‌ మండలం సోమక్కపేట గంగిరెద్దులగూడకు చెందిన ఎల్లమ్మ (45) వర్షంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఆమెపై పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.