Railway News: దక్షిణ మద్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పలు ప్యాసింజర్ రైళ్లను (Passenger Trains) పునరుద్దరిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. కరోనాతో పాటు పలు కారణాల వల్ల రద్దైన రైళ్లను పునరుద్ధరిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 8 ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించారు. పూర్తి వివరాలు ఇవే..
* ట్రైన్ నెంబర్ 07671 (గతంలో 57426) గుంతకల్-కాచిగూడ మధ్య ప్యాసింజర్ ట్రైన్ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ 06.00 గంటలకు బయలు దేరి అదే రోజు 15.40కి గమ్యానికి చేరుతుంది.
* ట్రైన్ నెంబర్ 07670 (గతంలో 57425) కాచిగూడ – గుంతకల్ మధ్య ప్యాసింజర్ ట్రైన్ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ 10.05 గంటలకు బయలు దేరి అదే రోజు 20.05కి గమ్యానికి చేరుతుంది.
* ట్రైన్ నెంబర్ 07274 (గతంలో 57473) కాచిగూడ – బోధన్ మధ్య ప్యాసింజర్ ట్రైన్ ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ 16.00 గంటలకు బయలు దేరి అదే రోజు 22.25 గంటలకి గమ్యానికి చేరుతుంది.
* ట్రైన్ నెంబర్ 07275 (గతంలో 57474) బోధన్ – మహబూబ్ నగర్ మధ్య ప్యాసింజర్ ట్రైన్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ 05.20 గంటలకు బయలు దేరి అదే రోజు 13.45కి గమ్యానికి చేరుతుంది.
* ట్రైన్ నెంబర్ 07587 (గతంలో 57456) మహబూబ్ నగర్ – కాచిగూడ మధ్య ప్యాసింజర్ ట్రైన్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ 14.10 గంటలకు బయలు దేరి అదే రోజు 16.30కి గమ్యానికి చేరుతుంది.
* ట్రైన్ నెంబర్ 07588 (గతంలో 57486) మిర్జాపల్లి – కాచిగూడ మధ్య ప్యాసింజర్ ట్రైన్ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ 05.50 గంటలకు బయలు దేరి అదే రోజు 08.30కి గమ్యానికి
చేరుతుంది.
* ట్రైన్ నెంబర్ 07583 (గతంలో 57447) కాచిగూడ – మహబూబ్‌నగర్ మధ్య ప్యాసింజర్ ట్రైన్ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ 13.15 గంటలకు బయలు దేరి అదే రోజు 15.45కి గమ్యానికి
చేరుతుంది.
* ట్రైన్ నెంబర్ 07584 (గతంలో 57448) మహబూబ్‌నగర్ – మిర్జాపల్లి మధ్య ప్యాసింజర్ ట్రైన్ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రైన్ 16.10 గంటలకు బయలు దేరి అదే రోజు 22.20కి గమ్యానికి
చేరుతుంది.
ఇంగ్లీష్ టీచర్ కు ఇదేం పాడు బుద్ది.. సారుగారు చేసిన పనికి చితక బాదిన జనం