వరంగల్ జిల్లా నర్సంపేటలోని నెహ్రూనగర్ కాలనీలో ఆరడుగుల నాగుపాము హల్చల్ చేసింది. ఇంటి పరిసరాల్లోకి ప్రవేశించిన పాము అక్కడున్న ప్రజలను పరుగులు పెట్టించింది.. వారంతా దాదాపు గంటకు పైగా పామును చూసి తీవ్ర భయంతో పరుగులు తీశారు. చివరకు స్నేక్ క్యాచర్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన నర్సంపేటలోని నెహ్రు కాలనీలో జరిగింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.. ఆరడుగుల నాగుపాము హల్చల్ చేసింది.. బుసలు కొడుతూ అక్కడ ప్రజలను కాసేపు వనికించింది.. పామును చూసిన కాలనీ ప్రజలు పరుగులు పెట్టారు.. ఇంట్లో ఉన్నవాళ్లు వామ్మో పామంటూ హడలెత్తిపోయారు. స్థానికులు స్నేక్స్ క్యాచర్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్స్ క్యాచర్ ఆ పామును చాకచక్యంగా పట్టాడు. ఆ పాముకు మొత్తం బురద ఉండడంతో పట్టిన పామును నీళ్లతో కడిగి పక్కనే ఉన్న పాకాల అడవుల్లోకి తీసుకెళ్లి విడిచి పెట్టారు. అయితే నివాస గృహాల మధ్యకు అంతపెద్ద పాము రావడంతో కాలనీవాసులంతా భయాందోళన చెందుతున్నారు.
అయితే వేసవికాలం మొదలై.. వేడి తాపం పెరగడంతో.. పాములు జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని.. అవి కానీ.. ఇతర వన్యప్రాణులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అటవీ సిబ్బంది కోరుతున్నారు. వాటికి హాని తలపెట్టవద్దని సూచిస్తున్నారు.
Also Read: జీవితం నీటి బుడగ అంటే ఇదేనేమో.. గుండె ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి..