అగ్గిపెట్టెలో పట్టే చీర.. యువ నేతన్న అద్భుత కళ.. చూస్తే వావ్ అనాల్సిందే..

|

Feb 23, 2022 | 1:52 PM

తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన జయ్.. అద్భుతమైన నేత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, అందరి మన్ననలు పొందుతున్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీరను..

అగ్గిపెట్టెలో పట్టే చీర.. యువ నేతన్న అద్భుత కళ.. చూస్తే వావ్ అనాల్సిందే..
Match Box Saree 1
Follow us on

తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన జయ్.. అద్భుతమైన నేత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, అందరి మన్ననలు పొందుతున్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి, ఔరా అనిపించుకున్నారు. జయ్ తండ్రి పరంధాములు కూడా గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసి, తెలంగాణ నేతన్న పనితనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. అంతే కాకుండా అగ్గిపెట్టెలో పట్టే శాలువాను కూడా తయారుచేసి అద్భుతం చేశారు. తండ్రి నుంచి నేత నైపుణ్యాలు పుణికి పుచ్చుకున్న జయ్.. తన నాన్న బాటలో పయనిస్తున్నారు. అంతకు ముందు సూదిలో పట్టే చీరను తయారుచేసి, అందరి మన్ననలు పొందారు. తామర నారతోనూ వస్త్రాలు తయారు చేసి, శెభాష్ అనిపించుకుంటున్నారు. అంతేకాదు ఎలాంటి కుట్లు లేకుండా డ్రెస్‌ను తయారు చేశారు జయ్.

ప్రభుత్వం ప్రొత్సహిస్తే, మరిన్ని అద్భుతాలు చేసి చూపిస్తానని జయ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చేనేత కార్మికుల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోంది. నేతన్నను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇప్పటికే బతుకమ్మ చీరల తయారీని అప్పగించారు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్‌.. వీరిపై దృష్టి పెట్టి, ప్రోత్సహిస్తున్నారు.

Also Read

ప్రియుడిని చితక బాదిన యువతి.. కారణం తెలిస్తే శెభాష్ అనాల్సిందే..

SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు అలెర్ట్.. ఆ గడువు మార్చి 31 వరకే.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

Professor jobs: తమిళనాడు సెంట్రల్‌ యూనివర్సటీలో ప్రొఫెసర్‌ ఉద్యోగాలు.. అర్హతలివే..