యాదాద్రి భువనగిరి హాస్టల్‌లో బాలికల ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. అసలు విధ్యార్ధినిలది హత్యనా..? ఆత్మహత్యనా..? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. విద్యార్థినుల మృతదేహాలపై గాయాలున్నట్టు ఇరువురి బాలికల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్యపై అనేక అనుమమానాలు వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ పిల్లలను కావాలనే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని వైష్ణవి తండ్రి రాజు ఆరోపించారు.
మరోవైపు భువనగిరి హాస్టల్‌లో బాలికల ఆత్మహత్య కేసులో ఆరుగురిపై కేసు నమోదైంది. హాస్టల్ వార్డెన్ శైలజ, ఆటోడ్రైవర్ ఆంజనేయులు, వంట మనుషులు సుజాత, సులోచనపై కేసు నమోదు కాగా. అటు పీఈటీ ప్రతిభ, టీచర్ భువనేశ్వరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే హాస్టల్ వార్డెన్, ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు..అటు వార్డెన్ శైలజ, ఆంజనేయులును విచారిస్తున్నారు పోలీసులు. దోషులను శిక్షించాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి..మరోవైపు విద్యార్థినుల ఆత్మహత్యతో హాస్టల్ ఖాళీ అయ్యింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి