Shirdi Tour Package: షిర్డీకి వెళ్లే భక్తుల కోసం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ.. చార్జీలు ఇవే..

|

Oct 18, 2021 | 2:36 PM

Shirdi Tour Package: కరోనా మహమ్మారి కాలంలో పర్యటకానికి వెళ్లేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. గత ఏడాదికిపైగా విజృంభించిన కరోనా వైరస్‌.. ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది..

Shirdi Tour Package: షిర్డీకి వెళ్లే భక్తుల కోసం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ.. చార్జీలు ఇవే..
Follow us on

Shirdi Tour Package: కరోనా మహమ్మారి కాలంలో పర్యటకానికి వెళ్లేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. గత ఏడాదికిపైగా విజృంభించిన కరోనా వైరస్‌.. ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. దీంతో అన్ని పర్యటక స్థలాలు తెరుచుకున్నాయి. అయితే షిర్టీకి షిర్డీకి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజ్‌ను ప్రారంభించినట్టు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ (TSTDC) తెలిపింది. హైదరాబాద్ నుంచి షిర్టీ వెళ్లే భక్తులకు ఈ ప్యాకేజ్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

ప్రతి బుధ, శుక్రవారాల్లో సాయంత్రం 4 గంటలకు బేగంపేటలోని టూరిజంప్లాజా నుంచి ప్రత్యేక బస్సు బయలుదేరుతుంది. టూర్ ప్యాకేజ్‌లో భాగంగా వెళ్లేటప్పుడు శనిసింగనాపూర్‌, వచ్చేటప్పుడు అజంతా ఎల్లోరాను సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు.

మూడు రోజుల పాటు సాగే ఈ టూర్‌కు పెద్దలు రూ.3,250, పిల్లలు రూ.2,060 చెల్లించాల్సి ఉంటుంది. ఈ టూర్‌ ప్యాకేజ్‌లో భాగంగా షిర్డీలో ఒక రాత్రి బస ఏర్పాటు చేస్తారు. షిర్డీ సాయిబాబా దర్శనానికి దర్శనం టికెట్లను ఎవరికివారే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలని టీఎస్‌టీడీసీ తెలిపింది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో షిర్డీ సాయిబాబా ఆలయ అధికారులు.. కోవిడ్ సర్టిఫికేట్ ఇతర వివరాలు అడుగుతున్నందున్న తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ తరఫున టికెట్లు బుక్ చేయడం లేదని అన్నారు. ఇక ప్రస్తుతం పర్యటక స్థలాలన్ని కూడా తెరుచుకోవడంలో పర్యటకులతో సందడిగా నెలకొంది. కాకపోతే కోవిడ్‌ వ్యా్క్సిన్‌ తీసుకున్నట్లుగా సర్టిఫికేట్‌ ఉండాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినా.. కోవిడ్‌ నిబంధనలు పాటించడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా తగ్గిందని నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం పొంచివుండే అవకాశం ఉందంటున్నారు. టూర్‌లో భాగంగా మాస్క్‌లు ధరించడం, ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్‌ చేసుకోవడం మర్చిపోవద్దని చెబుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Credit Card: ఈ క్రెడిట్‌ కార్డు తీసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్‌.. ఎలాంటి వడ్డీ లేకుండా ఈఎంఐ సదుపాయం

Busines Ideas: కేంద ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షల రుణంతో నెలకు రూ.50వేలు సంపాదించవచ్చు.!