Shabbir Ali: తెలంగాణలో ఈ నెల 30న రెండు కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. సోమవారం నామినేషన్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని కార్పొరేషన్, మునిసిపల్ ఎన్నికలను రద్దు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు షబ్బీర్ అలీ లంచ్ మోషన్ పిటీషన్‌ను దాఖలు చేశారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులను అంచనా వేసి ఎన్నికలను వాయిదా వేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు. దీనిపై మరికాసేపట్లో న్యాయస్థానంలో విచారణ జరిగే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ ఎన్నికలను వాయిదా వేయాలని షబ్బీర్ అలీ.. ఎన్నికల సంఘాన్ని సైతం కోరారు.
కాగా.. తెలంగాణలో ఏప్రిల్ 30న ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపెట్, నకిరేకల్, కొత్తూరు మున్సిపల్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించాకగ. ఈ రోజు నామినేషన్ల పరిశీలన జరుగుతోంది. 22 వరకు నామినేషన్లఉప సంహరణ చేపట్టనున్నారు. మే 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీంతోపాటు… వివిధ కారణాలతో ఖాళీ అయిన పలు కార్పొరేషన్లు, మునిసిపల్ ప్రాంతాల్లోని డివిజన్లకు కూడా ఈనెల 30న పోలింగ్ జరగనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌కు, గజ్వేల్, నల్గొండ, జల్‌పల్లి, అలంపూర్, బోధన్, పరకాల, మెట్‌పల్లి, బెల్లంపల్లిలో ఒక్కో వార్డుకు ఎన్నికలను నిర్వహించనున్నారు.
Also Read: