Telangana: ఆత్మహత్యకు ముందు నిందితుడు రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియో.. వెలుగులోకి సంచలన విషయాలు..

షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకోగా.. అతని ఫోన్‌లో ఓ సెల్ఫీ వీడియోను పోలీసులు గుర్తించారు. అసలు ఆ హంతకుడు అంతటి ఘాతుకానికి ఎందుకు ఒడిగట్టాడు? చంపడానికి ముందే రికార్డ్ చేసిన ఆ సెల్ఫీ వీడియోలో ఉన్న నిజాలేంటి? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: ఆత్మహత్యకు ముందు నిందితుడు రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియో.. వెలుగులోకి సంచలన విషయాలు..
Rajkumar Last Selfie Video

Updated on: Jul 13, 2026 | 6:52 PM

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. హంతకుడు రాజ్‌కుమార్ ఘాతుకానికి పాల్పడటానికి ముందే రికార్డ్ చేసిన ఒక సెల్ఫీ వీడియో ఇప్పుడు పోలీసులకు చిక్కింది. రాజ్‌కుమార్ మృతదేహం లభ్యమైన చోటే అతడి మొబైల్ ఫోన్ కూడా దొరికిందని, అందులోనే ఈ సెల్ఫీ స్టేట్‌మెంట్ ఉందని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. రాజ్‌కుమార్ ఈ ఘోరానికి ఒడిగట్టడానికి కొద్దిగంటల ముందు.. అంటే జూలై 10న సాయంత్రం 4:55 గంటల సమయంలో తన ఫోన్‌లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అందులో క్లియర్‌గా వివరించాడు.

వీడియోలో రాజ్‌కుమార్ ఆవేదన..

‘‘నా సంపాదనలో సగం వాళ్ల కోసమే తగలేశా. నా దగ్గర నుంచి పెద్ద మొత్తంలో పైసలు లాగి నన్ను పూర్తిగా రోడ్డున పడేశారు. ఆ అమ్మాయిని నమ్మి సర్వస్వం కోల్పోయి అప్పులపాలయ్యా. ఆఖరికి నా కన్న పిల్లలకు రూపాయి భూమి కూడా లేకుండా చేసేశా. నన్ను ఇంతలా ముంచేసి.. చివరకు నాపైనే కేసు పెట్టి జైలుకు పంపించారు’’ అంటూ రాజ్‌కుమార్ సదరు వీడియోలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

కారులోనే బాలిక..

నమ్మిన వాళ్లే తనను ముంచి, జైలుకు పంపారనే కక్షతోనే రాజ్‌కుమార్ ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే భార్య, పిల్లలను చంపే ఆ భయానక సమయంలో ఒక బాలిక కారులోనే ఉందనే ఆందోళనకరమైన విషయం కూడా ఈ కేసులో విచారణలో భాగంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం లభ్యమైన మొబైల్ ఫోన్‌తో పాటు ఆ వీడియోను సైన్స్ అండ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని, పూర్తి సాంకేతిక ఆధారాలతో కేసు దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని సీపీ తరుణ్ జోషి తెలిపారు.

అసలేం జరిగిందంటే..?

రాజ్ కుమార్ తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఈ నెల 10న దారుణానికి ఒడిగట్టాడు. మొదట షాబాద్ టౌన్‌లో మైనర్ బాలిక తల్లి, నాయనమ్మ లను నరికి చంపాడు. ఆ తర్వాత తన భార్యాపిల్లలను కిరాతకంగా చంపేశాడు. పై మైనర్ బాలికను కారులో తీసుకెళ్లి అఖిల్ సాగర్ చెరువు వద్ద గొంతుకోశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు సైతం కేసును సవాల్‌గా తీసుకుని నిందితుడి కోసం తీవ్ర గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితుడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం.

Follow Us