చరిత్ర సృష్టించిన ఏడేళ్ల హైదరాబాద్ చిన్నారి.. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అతి పిన్నవయస్కుడిగా రికార్డ్.

|

Mar 19, 2021 | 6:24 PM

ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలోని అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి చరిత్ర తిరగరాశాడు ఏడేళ్ల తెలంగాణ కుర్రాడు.

చరిత్ర సృష్టించిన ఏడేళ్ల హైదరాబాద్ చిన్నారి.. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అతి పిన్నవయస్కుడిగా రికార్డ్.
Seven Year Old Hyderabad Boy Scales Mount Kilimanjaro
Follow us on

Hyderabad boy scales kilimanjaro: ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలోని అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి చరిత్ర తిరగరాశాడు ఏడేళ్ల తెలంగాణ కుర్రాడు. హైదరాబాద్‌కు చెందిన ఏడేళ్ల బాలుడు ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల్లో ఒకటైన మౌంట్ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి ఔరా అనిపించాడు. విరాట్ చంద్ర తేలుకుంట మార్చి 6వ తేదీన ఈ సాహసాన్ని పూర్తిచేశాడు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం లెక్కచేయకుండా విరాట్ కిలిమంజారో పర్వతాన్ని ఎక్కడం విశేషం.

“చాలా భయపడ్డాను… కానీ నా లక్ష్యాన్ని చేరుకోవడమే ముఖ్యం అనుకున్నాను” చిన్నారి విరాట్ చంద్ర చెప్పుకొచ్చాడు. బహుశా… కిలీ మంజారో పర్వతాన్ని ఎక్కిన కొద్ది మంది పిల్లల్లో విరాట్ ఒకడు కావడం విశేషం. ఆ పర్వతం ఎలాంటిదంటే… ఒక్కటే ఉంటుంది. చుట్టూ తోడుగా ఏ పర్వతాలూ ఉండవు. మంచును కుప్పలా ఉంటుంది. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన విరాట్‌ను పలువురు అభినందనలు తెలిపారు. కిలిమంజారో అంటే…ఆఫ్రికా ఖండంలోనే ఎతైన పర్వతం, 5,895 మీటర్లు ఎత్తు. అనుభవం ఉన్న వాళ్ళు ఎక్కాలంటేనే చాలా కష్టం, అలాంటిది. ప్రపంచంలోని ఎంతోమంది సాహసికులు ఈ పర్వతం ఎక్కేందుకు ఉత్సాహం చూపుతారు. హైదరాబాద్ కి చెందిన విరాట్ చంద్ర పర్వతాధిరోహన చేసి అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాడు. మార్చి 5న ట్రెక్కింగ్ మొదలు పెట్టి…6 రోజుల సుధీర్ఘ ప్రయాణం తర్వాత కిలిమంజారో చేరుకొని.. తెలంగాణ జాతిరత్నం అనిపించుకున్నాడు విరాట్ చంద్ర.

ఇదీ చదవండిః Taapsee Pannu : ఆసక్తికర కామెంట్స్ చేసిన తాప్సీ.. ఆ హీరోయిన్ ను ఉద్దేశించే అన్నదా.. నెటిజన్లు ఏమంటున్నారంటే..