Special Trains: హైదరాబాద్ నుంచి ఆ రూట్లలో ప్రయాణించే వారికి రైల్వే గుడ్‌ న్యూస్‌.. మరో 30 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే..

|

Dec 29, 2022 | 6:29 PM

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే రైళ్ల సర్వీసులను పెంచుతూ ప్రకటించిన విషయం తెలిసిందే. న్యూ ఇయర్, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పలు ప్రాంతాల మధ్య..

Special Trains: హైదరాబాద్ నుంచి ఆ రూట్లలో ప్రయాణించే వారికి రైల్వే గుడ్‌ న్యూస్‌.. మరో 30 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే..
Special Trains
Follow us on

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే రైళ్ల సర్వీసులను పెంచుతూ ప్రకటించిన విషయం తెలిసిందే. న్యూ ఇయర్, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పలు ప్రాంతాల మధ్య 94 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇవి జనవరి 1 నుంచి 20 వరకు పలు ప్రాంతాల మధ్య నడవనున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని.. మరో 30 సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గురువారం ప్రకటించింది. ప్రయాణికుల కోసం.. పలు గమ్య స్థానాలను కవర్ చేస్తూ మరో 30 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో తెలిపింది.

ఈ ప్రత్యేక రైళ్లు ప్రధానంగా సికింద్రాబాద్‌, హైదరాబాద్, కాచిగూడ, వికారాబాద్‌ నుంచి నర్సాపూర్‌, మచిలీపట్నం, కాకినాడ వైపు నడుస్తాయని పేర్కొంది. సంక్రాంతి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని.. రైలు ప్రయాణికుల అవసరాలు, డిమాండ్‌లను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ప్రకటన విడుదల చేశారు.

Railway

ముఖ్యంగా ఈ రైలు సర్వీసులు ప్రయాణికులకు సౌకర్యవంతంగా రాత్రి వేళల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ రైలు సర్వీసులు వివిధ క్లాస్ లను కలిగి ఉంటాయని.. రిజర్వ్ వసతిని కోరుకునే ప్రయాణికులు రైల్వే పిఆర్ఎస్ కౌంటర్లతో పాటు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

ఇవి కూడా చదవండి

సంక్రాంతి ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవే..

Sankranti Special Trains

అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లలో ప్రయాణించాలనుకునే ప్రయాణీకులు తమ టిక్కెట్‌లను మొబైల్ యాప్‌లో యుటిఎస్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..