
కర్నూలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద దానికి గురై 20 మంది ప్రయాణికులు మరణించిన ఘటన మరువక ముందే తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో మరో ఘటన వెలుగు చూసింది. సదాశివపేట పట్టణంలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సుకి పెను ప్రమాదం తప్పింది. స్థానికంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు.. విద్యార్థులను ఎక్కించుకునేందుకు పట్టణానికి వచ్చింది. విద్యార్థులను తీసుకొని స్కూల్‌కు వెళ్లేందుకు బయల్దేరింది. మార్గ మధ్యలో ఒక విద్యుత్ తీగ తెగి విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సుపై పడింది.
గమనించిన బస్సు డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బస్సును పక్కకు ఆపేశాడు. బస్సులోంచి విద్యార్థులనంతా కిందకు దించాడు. గమనించిన స్థానికులు కూడా డ్రైవర్‌కు సహాయం చేసి విద్యార్థులను బస్సుకు దూరంగా తీసుకెళ్లారు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలసుకున్న విద్యుత్ శాఖ అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపి వేసి బస్సుపై పడిన కరెంటు వైర్‌ను తొలగించారు.
మరోవైపు విద్యుత్ తీగలు బస్సుపై తెగిపడని దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యారు. దీంతో ఈప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా విద్యుత్ తీగలు బస్సులో తెగిపడడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.