RTI – Khammam: సమాచారం అడిగినందుకు యువకుడిని బెదిరించిన ఎమ్మెల్యే అనుచరులు..!

|

Aug 14, 2022 | 8:43 AM

RTI - Khammam: సమాచార హక్కు ద్వారా సమాచారం సేకరించే హక్కు అందరికీ లేదా? ఓ గ్రామంలో నిధుల గురించి తెలుసుకునేందుకు దరఖాస్తు చేసుకున్న

RTI - Khammam: సమాచారం అడిగినందుకు యువకుడిని బెదిరించిన ఎమ్మెల్యే అనుచరులు..!
Rti
Follow us on

RTI – Khammam: సమాచార హక్కు ద్వారా సమాచారం సేకరించే హక్కు అందరికీ లేదా? ఓ గ్రామంలో నిధుల గురించి తెలుసుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తిని కొందరు బెదిరించారు. ఇంతకీ బెదరించింది ఎవరు? అసలేం జరిగింది? పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడిని ఎమ్మెల్యే అనుచరులు బెదిరించారు. జీళ్లచెరువు గ్రామ పంచాయితీకి ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి? ఎంత ఖర్చు చేశారు అనే సమాచారాన్ని తెలుసుకునేందుకు RTI ద్వారా దరఖాస్తు చేశాడు సురేష్‌ అనే యువకుడు. అయితే సమాచారం ఇవ్వలేదు కానీ ఓ ఎమ్మెల్యే అనుచరుడి నుంచి బెదిరింపులు వచ్చాయి.

అసలు నీకెందుకు సమాచారం ఇవ్వాలంటూ ఓ ఎమ్మెల్యే అనుచరుడు బెదిరించాడని, దుర్భాషలాడాడని బాధితుడు వాపోతున్నాడు. RTI ద్వారా సమాచారాన్ని సేకరించే హక్కు తనకు లేదా ? అని ప్రశ్నిస్తున్నాడు సురేష్‌. సమాచార హక్కు చట్టం ద్వారా గ్రామానికి చెందిన నిధుల గురించి దరఖాస్తు చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నాడు బాధితుడు సురేష్‌. తనను దుర్భాషలాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..