Bus accident: NH 44 పై ఘోర ప్రమాదం..ఏపీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా 20 మందికి గాయాలు..

ఇటిక్యాలపాడు సమీపంలో NH 44 జాతీయ రహదారి పై తెల్లవారుజామున ఘోర ఆర్టీసీ బస్సు అదుపు తప్పి గుంతలో పడింది. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. 9మందికి తీవ్ర గాయాలు కాగా.. మరో..

Bus accident: NH 44 పై ఘోర ప్రమాదం..ఏపీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా 20 మందికి గాయాలు..
Rtc Bus Accident

Updated on: Feb 19, 2026 | 8:14 AM

Bus accident: జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. జిల్లాలోని ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో NH 44 జాతీయ రహదారి పై తెల్లవారుజామున ఘోర ఆర్టీసీ బస్సు అదుపు తప్పి గుంతలో పడింది. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. 9మందికి తీవ్ర గాయాలు కాగా.. మరో 11మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.

వీడియో ఇక్కడ చూడండి..

హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన బస్సు అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణంగా అంచనా వేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ,స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us