Telangana Assembly: అసెంబ్లీలో బిగ్‌ఫైట్‌‌కు సిద్ధమవుతున్న కాంగ్రెస్.. అ.. ఆలు కూడా తెలియదంటూ కేటీఆర్ సెటైర్..

|

Feb 11, 2024 | 12:39 PM

అసెంబ్లీ వేదికగా సోమవారం హైవోల్టేజ్ ఫైట్‌ జరగబోతోంది. ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై హోరాహోరీగా తలపడేందుకు రెడీ అవుతున్నాయ్‌ కాంగ్రెస్ అండ్‌ బీఆర్‌ఎస్‌. మేడిగడ్డ ఇష్యూతో BRSను ఇరుకున పెట్టేందుకు ప్రభుత్వం... KRMB అంశంతో ఎదురుదాడికి బీఆర్‌ఎస్‌ వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయ్‌. దాంతో, రేపు అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య బిగ్‌ ఫైట్‌ ఖాయంగా కనిపిస్తోంది.

Telangana Assembly: అసెంబ్లీలో బిగ్‌ఫైట్‌‌కు సిద్ధమవుతున్న కాంగ్రెస్.. అ.. ఆలు కూడా తెలియదంటూ కేటీఆర్ సెటైర్..
KTR - Revanth Reddy
Follow us on

అసెంబ్లీ వేదికగా సోమవారం హైవోల్టేజ్ ఫైట్‌ జరగబోతోంది. ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై హోరాహోరీగా తలపడేందుకు రెడీ అవుతున్నాయ్‌ కాంగ్రెస్ అండ్‌ బీఆర్‌ఎస్‌. మేడిగడ్డ ఇష్యూతో BRSను ఇరుకున పెట్టేందుకు ప్రభుత్వం… KRMB అంశంతో ఎదురుదాడికి బీఆర్‌ఎస్‌ వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయ్‌. దాంతో, రేపు అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య బిగ్‌ ఫైట్‌ ఖాయంగా కనిపిస్తోంది. నీటిపారుదలశాఖపై రేపు శ్వేతపత్రం విడుదల చేయబోతోంది ప్రభుత్వం. ఆ తర్వాత ఇదే అంశంపై అసెంబ్లీలో పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇవ్వనుంది. దాంతో, ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై హాట్‌హాట్‌ డిస్కషన్స్‌ జరగనుంది. అందుకే, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశంకాబోతున్న రేవంత్‌ అండ్ భట్టి… మేడిగడ్డ అంశంపై ఎమ్మెల్యేలకు బ్రీఫింగ్‌ ఇవ్వనున్నారు. BRSను దీటుగా ఎలా ఎదుర్కోవాలి.. ఏ విధంగా చర్చించాలి అనే విషయాలపై ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి గైడెన్స్‌ ఇవ్వనున్నారు.

ఇదిలాఉంటే.. ప్రభుత్వానికి ధీటుగా కౌంటర్‌ ఇచ్చేందుకు వ్యూహ ప్రతి వ్యూహాలతో సిద్ధమవుతోంది బీఆర్‌ఎస్‌. మేడిగడ్డను చూడాలనుకుంటే మీరు చూడండి… తమకవసరమేంటి అంటున్నారు గులాబీ నేతలు. కాళేశ్వరం కట్టిందే మేము… మేం కట్టిన ప్రాజెక్ట్‌ను మాకే చూపిస్తారా? అంటూ సెటైర్లేస్తున్నారు. అసలు, కాళేశ్వరం గురించి కాంగ్రెసోళ్లకు అ.. ఆలు కూడా తెలియదన్నారు కేటీఆర్‌. మేడిగడ్డకు రావాలన్న రేవంత్‌ ఆహ్వానంపైనా కేటీఆర్ సెటైర్లు వేశారు.. కాళేశ్వరం కట్టిందే మేము… మేం కట్టిన ప్రాజెక్ట్‌ను మాకే చూపిస్తారా? మేడిగడ్డకు రావాల్సిన అవసరం మాకేంటి? అంటూ ఫైర్ అయ్యారు.

ఇలా.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ హైవోల్టేజ్‌ వార్‌కు రెడీ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కాయి.. మేడిగడ్డ ఇష్యూతో BRSను కాంగ్రెస్ ఇరుకున పెడుతుందా..? లేక KRMB అంశంతో బీఆర్ఎస్ .. ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తుందా..? అనేది ఆసక్తికరంగా మారింది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..