Telangana Assembly: కేటీఆర్‌ను సీఎం చేయాలన్నారు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. దద్దరిల్లిన అసెంబ్లీ..

తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది. అసెంబ్లీ వేదికగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య ఆరుగ్యారెంటీలు, రాజకీయ అంశాలపై వాడీవేడి చర్చ జరిగింది. అసెంబ్లీలో గవర్నర్‌కు ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య స్నేహం ఉందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. దీనిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్పందించారు.

Telangana Assembly: కేటీఆర్‌ను సీఎం చేయాలన్నారు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. దద్దరిల్లిన అసెంబ్లీ..
KCR Revanth Reddy

Updated on: Feb 09, 2024 | 2:04 PM

తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది. అసెంబ్లీ వేదికగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య ఆరుగ్యారెంటీలు, రాజకీయ అంశాలపై వాడీవేడి చర్చ జరిగింది. అసెంబ్లీలో గవర్నర్‌కు ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య స్నేహం ఉందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. దీనిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్పందించారు. తమకు బీజేపీతో ఎలాంటి స్నేహం లేదని.. ఎంఐఎం ఒక్కటే తమకు ఫ్రెండ్లీ పార్టీ అని అన్నారు. అయితే పోచారం వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్ బంధమని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన అనేక బిల్లులకు బీఆర్‌ఎస్ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. కేటీఆర్‌ను సీఎం చేసేందుకు సహకరించాలని ప్రధాని మోదీని కేసీఆర్ కోరారని.. ఈ విషయాన్ని మోదీ స్వయంగా చెప్పారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు పోచారం శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థులను బీఆర్‌ఎస్ ఓడించిందని గుర్తు చేశారు. ఒకవేళ గతంలో కేటీఆర్‌ను సీఎం చేయాలనుకుంటే.. తామే వందమంది ఉన్నామని చెప్పారు.

కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారంటీల్లో ఏ ఒక్కటి సరిగ్గా అమలు కావడంలేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అసెంబ్లీలో ఫ్రీ బస్సు, ఆటోడ్రైవర్ల ఇష్యూపై ప్రభుత్వాన్ని నిలదీశారు. దానికి అదే స్థాయిలో కౌంటరిచ్చారు మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌.. కాంగ్రెస్‌ది ప్రచారం తప్ప..హామీల అమలు ఊసేలేదని మండిపడ్డారు BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి. ప్రచారం తప్ప..హామీల అమలు లేదని మండిపడ్డారు. ఫ్రీ బస్సుతో మహిళలు ఇబ్బంది పడుతున్నారని, మరిన్ని బస్సులు పెంచాలని కోరారు. రోడ్డునపడ్డ ఆరున్నర లక్షలమంది ఆటోడ్రైవర్లను ఆదుకోవాలని కోరారు. వంద రోజుల్లో ఆరునూరైనా ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతామన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. ఆటో డ్రైవర్లను కూడా తప్పకుండా ఆదుకుంటా మన్నారు. బీఆర్‌ఎస్‌ కావాలనే తప్పుడు ఆరోపణలను చేస్తోందని విమర్శించారు శ్రీధర్‌బాబు.

21 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు BRS MLA పల్లా రాజేశ్వర్‌రెడ్డి. హామీల అమల్లో స్పష్టత లేదని విమర్శించారు. 21 మంది ఆటోడ్రైవర్లు చనిపోయారని క్రియేట్‌ చేసింది మీరేనంటూ పల్లాకు కౌంటరిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. BRS నేతలు ఆటోడ్రైవర్లను అవమానిస్తున్నారు.. బీఆర్‌ఎస్ సభ్యుల మైండ్‌సెట్ మారాలి అంటూ మంత్రి పొన్నం ఘాటుగా కౌంటరిచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..