KTR Tweet: ఆసరా పెన్షన్‌ డబ్బులు తిరిగి ఇచ్చేయండి.. వృద్ధురాలికి సర్కార్ నోటీస్.. మండిపడ్డ కేటీఆర్!

|

Jul 13, 2024 | 6:04 PM

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ వృద్ధురాలికి ప్రభుత్వం ఆసరా పెన్షన్ రికవరీ నోటీసు ఇవ్వడం సంచలనంగా మారింది. దీంతో సంక్షేమ పథకాలపై ప్రభుత్వ తీరును ఎండగడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ట్వీట్‌ చేశారు. కొత్తగా అనేక పథకాలు తీసుకొస్తామని చెప్పి, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బులు వసూలు చేయడమేంటని మండిపడ్డారు. అయితే పెన్షన్ రికవరీ నోటీసును సమర్థించకుంటూ ప్రభుత్వం తగిన వివరణ ఇచ్చింది.

KTR Tweet: ఆసరా పెన్షన్‌ డబ్బులు తిరిగి ఇచ్చేయండి.. వృద్ధురాలికి సర్కార్ నోటీస్.. మండిపడ్డ కేటీఆర్!
Asara Penssion
Follow us on

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ వృద్ధురాలికి ప్రభుత్వం ఆసరా పెన్షన్ రికవరీ నోటీసు ఇవ్వడం సంచలనంగా మారింది. దీంతో సంక్షేమ పథకాలపై ప్రభుత్వ తీరును ఎండగడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ట్వీట్‌ చేశారు. కొత్తగా అనేక పథకాలు తీసుకొస్తామని చెప్పి, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బులు వసూలు చేయడమేంటని మండిపడ్డారు. అయితే పెన్షన్ రికవరీ నోటీసును సమర్థించకుంటూ ప్రభుత్వం తగిన వివరణ ఇచ్చింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దాసరి మల్లమ్మ 80 ఏళ్ల వృద్ధురాలు. అయితే ఆమెకు ఇచ్చిన ఆసరా పింఛను డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం రికవరీ నోటీసు జారీ చేసింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆయన తన సోషల్ మీడియా ‘ఎక్స్’ ఖాతాలో దీనికి సంబంధించి ఓ పోస్ట్ పెట్టారు. మల్లమ్మకు ప్రభుత్వం పంపిన నోటీసును, ఆమె ఫోటో తోపాటు జత చేశారు. అనర్హులైనప్పటికీ రూ. 1,72,928ని పొందినందుకు ఆ సొమ్మును తిరిగి ఇవ్వాలని కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం పేరిట ఆమెకు రికవరీ నోటీసు పంపినట్టు అందులో రాసి ఉంది. ప్రభుత్వం ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ దారులకు.. పెన్షన్‌ డబ్బును ప్రభుత్వానికి వాపస్ ఇవ్వాలని నోటీసులు పంపుతున్నారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుందని కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరును కేటీఆర్ ట్వీట్‌ ద్వారా తప్పుబట్టారు.

2017 నుంచి మల్లమ్మ నెలకు రూ 24,073 డిపెండెంట్ పెన్షన్ పొందుతున్నారు. వైద్య శాఖలో ANMగా పనిచేసిన మల్లమ్మ కుమార్తె 2017లో మరణించడంతో నాటి నుంచి ఆమెకు ఈ పింఛను వస్తోంది. ఒకే ఆధార్ కార్డ్ డేటాపై మల్లమ్మ రెండు పింఛన్లు పొందుతున్న విషయాన్ని ప్రభుత్వ ట్రెజరీ కార్యాలయ అధికారులు గుర్తించారు. ఆమె కుమార్తె ప్రభుత్వ ఉద్యోగం చేసినందున పింఛను పొందే అర్హత మల్లమ్మకు లేదని అధికారులు వాదిస్తున్నారు. దీంతో పాటు మల్లమ్మ ఇద్దరు కుమారుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని, ప్రస్తుతం మల్లమ్మ అతని వద్దే ఉంటున్నారని, మల్లమ్మ ఆసరా పింఛన్‌కు అర్హురాలు కాదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ వివరణ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..