Jio: నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తున్న రిలయన్స్‌ జియో.. పోచంపల్లిలో ఒకే రోజు మరో రెండు టవర్లు ప్రారంభం..!

|

Nov 27, 2021 | 1:26 PM

Reliance Jio: రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తోంది. అన్ని ప్రాంతాల్లో జియో నెట్‌వర్క్‌ ఉండేలా చర్యలు చేపడుతోంది. అవసరమైన టవర్లను ఏర్పాటు..

Jio: నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తున్న రిలయన్స్‌ జియో.. పోచంపల్లిలో ఒకే రోజు మరో రెండు టవర్లు ప్రారంభం..!
Follow us on

Reliance Jio: రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తోంది. అన్ని ప్రాంతాల్లో జియో నెట్‌వర్క్‌ ఉండేలా చర్యలు చేపడుతోంది. అవసరమైన టవర్లను ఏర్పాటు చేస్తూ మెరుగైన నెట్‌వర్క్‌ సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌ వినియోగం పెరిగిపోయింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆన్‌లైన్‌ క్లాసుల కోసం ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్‌ అవసరమైన నేపథ్యంలో జియో నెట్‌వర్క్‌ను పెంచింది. ఈ నేపథ్యంలో యాదాద్రి భూవనగిరి జిల్లా పోచంపల్లి పట్టణంలో జియో తన మొబైల్‌ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించింది. మెరుగైన డేటా స్పీడ్‌ కోసం మరో రెండు టవర్లను ఏర్పాటు చేసింది.

వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో జియో మరో రెండు టవర్లు పట్టణంలో ఏర్పాటు చేసింది. అయితే ఇంత వరకు పట్టణంలో ఒకే రోజు రెండు టవర్లు ప్రారంభించడం ఒక రికార్డు. వీటితో ఇప్పుడు పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో జియోకు మొత్తం నాలుగు టవర్ల మొబైల్ నెట్‌వర్క్‌ సామర్ధ్యం కలిగినట్లయ్యింది. ఈ ప్రాంతంలో ఇతర అన్ని టెలికాం కంపెనీల కంటే జియో అత్యధిక టవర్లు కలిగి ఉండటంతో జియో డేటా స్పీడ్ మరింత మెరుగైంది. ఆన్‌లైన్‌ క్లాసులపై ఆధారపడిన కాలేజీ, స్కూట్‌ విద్యార్థులు ఇప్పుడు హై-స్పీడ్‌ జియో నెట్‌వర్క్‌తో మరింత ప్రయోజనం పొందుతున్నారు.

ఇవి కూడా చదవండి:

WhatsApp: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. డిజిటల్‌ పేమెంట్స్‌ చేసేవారి సంఖ్యను పెంచేందుకు అనుమతి..!

Recharge Plans: మొబైల్‌ యూజర్లకు షాక్‌.. పెరిగిన ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌ ధరలు.. పూర్తి వివరాలు

LPG Subsidy Updates: మీకు ఎల్‌పీజీ గ్యాస్‌ సబ్సిడీ రావడం లేదా..? కారణాలు ఏంటో తెలుసుకొని ఇలా చేయండి..!