
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా అభ్యర్థుల వివరాలను చేసింది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ఫిబ్రవరి 28 వరకు గడువు నిర్ణయించింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం మెరిట్ లిస్ట్ విడుదల చేయనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఈ క్రమంలో మార్చి చివరి నాటికి ఉద్యోగాల్లో కొత్త అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేరనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బంది కొరతను తీర్చేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో నియామకాలు చేపట్టింది. మొత్తం 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తోంది.
మల్టీ జోన్ వారీగా పోస్టుల విభజన
మల్టీ జోన్ – 1: 379 పోస్టులు
మల్టీ జోన్ – 2: 228 పోస్టులు
విభాగాల వారీగా పోస్టులు
గైనకాలజీ – 90
జనరల్ సర్జరీ – 43
జనరల్ మెడిసిన్ – 47
రేడియో డయాగ్నసిస్ – 21
హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ – 21
అనస్తీషియా – 44
పీడియాట్రిక్స్ – 28
బయోకెమిస్ట్రీ – 18
ఫిజియాలజీ – 29
ఫార్మకాలజీ – 28
ఫోరెన్సిక్ మెడిసిన్ – 21
కమ్యూనిటీ మెడిసిన్ – 25
ఎమర్జెన్సీ మెడిసిన్ – 15
సీటీ సర్జరీ – 14
అనాటమీ – 22
మైక్రోబయాలజీ – 15
పాథాలజీ – 15
ఆర్థోపెడిక్స్ – 12
ఇతర విభాగాల్లో కూడా కొన్ని పోస్టులు భర్తీ చేయనున్నారు.
వేతనం: University Grants Commission నిబంధనల ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నెలకు రూ. 68,900 నుంచి రూ. 2,05,500 వరకు వేతనం ఉంటుంది.
రాష్ట్రంలోని మొత్తం 34 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న బోధనా సిబ్బంది ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నియామక ప్రక్రియ చేపట్టబడుతోంది. ఇటీవల ప్రభుత్వం వైద్య కళాశాలల్లో నెలకొన్న సమస్యలను సమగ్రంగా పరిశీలించేందుకు ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగానే ఈ నియామకాల నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.