అతడో రక్తపిశాచి..రాత్రైతే ఉగ్రరూపమే..

ఇప్పుడు మేము చెప్పబోయే న్యూస్ వింటే మీకు ఒళ్లు జలదరిస్తుంది. మనుషులు ఎంత వికృతంగా తయారవుతున్నారో, ఆటవిక జంతువల వలే ఎలా ప్రవర్తి స్తున్నారో  చెప్పటానికి ప్రస్తుత సంఘటనను ఉదాహారణగా చెప్పుకోవచ్చు. మనుషుల, జంతులవుల రక్తాన్ని తాగే వ్యక్తుల్ని మనం హాలివుడ్ సినిమాల్లో చూస్తుంటాం. కానీ అలాంటి వ్యక్తులు మన సొసైటీ కూడా ఉన్నారు. అవును మేము చెప్పేది పచ్చి నిజం. అతడు పశువుల రక్తం రుచి మరిగిన మనిషి..రాత్రైతే చాలు అతడిలోని మరో కోణం బయటకు […]

అతడో రక్తపిశాచి..రాత్రైతే ఉగ్రరూపమే..

Updated on: Oct 04, 2019 | 3:44 PM

ఇప్పుడు మేము చెప్పబోయే న్యూస్ వింటే మీకు ఒళ్లు జలదరిస్తుంది. మనుషులు ఎంత వికృతంగా తయారవుతున్నారో, ఆటవిక జంతువల వలే ఎలా ప్రవర్తి స్తున్నారో  చెప్పటానికి ప్రస్తుత సంఘటనను ఉదాహారణగా చెప్పుకోవచ్చు. మనుషుల, జంతులవుల రక్తాన్ని తాగే వ్యక్తుల్ని మనం హాలివుడ్ సినిమాల్లో చూస్తుంటాం. కానీ అలాంటి వ్యక్తులు మన సొసైటీ కూడా ఉన్నారు. అవును మేము చెప్పేది పచ్చి నిజం. అతడు పశువుల రక్తం రుచి మరిగిన మనిషి..రాత్రైతే చాలు అతడిలోని మరో కోణం బయటకు వస్తుంది. చుట్టుపక్కల ఇండ్లలోని పశువులను ఎత్తుకెళ్లి వాటి రక్తం తాగుతుంటాడు. ఆపై వాటిని తీసుకొచ్చి సదరు యజమానుల ఇంటిముందు పడేస్తాడు. అలా ఇప్పటివరకు 60 మూగజీవాల నెత్తురు తాగాడు. అతడు ఎక్కడివాడో కాదు..మన తెలుగు రాష్ట్రమైన వనపర్తి జిల్లా సింగంపేటకు చెందిన కమ్మరి రాజు.

అతడి తీరుతో గ్రామస్తుల వెన్నులో వణుకుపుడుతుంది. పశువలు రక్తాన్నే తాగుతున్నవాడు..తమ చిన్నారులను కూడా ఎత్తుకెళ్లి రక్తం తాగుతాడేమోనని భయపడిపోతున్నారు. దీనిపై గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టారు. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో అతన్ని మానసిక రోగుల ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించినట్టు సర్పంచ్ విజయలక్ష్మి తెలిపారు. 10వ తరగతి వరకు చదువుకున్న రాజుకు.. ఇలా ఎందుకు మారిపోయాడో ఎవరికీ అంతుచిక్కడం లేదన్నారు.