వేములవాడలో అద్భుతం.. ఆలయ సమీపంలో అరుదైన శ్వేత నాగు.. అకస్మాత్తుగా తిరగబడి..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వరాలయం సమీపంలో అరుదైన శ్వేత నాగు ప్రత్యక్షమై భక్తులను భయాందోళనకు గురిచేసింది. భారీ పరిమాణంలో ఉన్న ఈ నాగు ఆలయ పరిసరాల్లో సంచరిస్తుండటంతో స్థానికులు, భక్తులు భయంతో పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్ జగదీశ్ చాకచక్యంగా పామును పట్టుకునే సమయంలో నాగుపాము తిరగబడినా, చివరకు సురక్షితంగా రక్షించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

వేములవాడలో అద్భుతం.. ఆలయ సమీపంలో అరుదైన శ్వేత నాగు.. అకస్మాత్తుగా తిరగబడి..
King Cobra

Edited By:

Updated on: May 19, 2026 | 4:21 PM

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ దేవస్థానంలో భక్తులు ఒక్కసారి షాక్ గురయ్యారు.. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న భీమేశ్వరస్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ శ్వేత నాగు ప్రత్యక్షమైంది. ఆలయ ప్రాంతంలో పాము సంచరిస్తుండటాన్ని గమనించిన స్థానికులు, భక్తులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ముఖ్యంగా.. వేసవి సెలవుల నేపథ్యంలో ఆలయానికి భక్తుల సంఖ్యలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో అరుదైన శ్వేత నాగు సమాచారం అందుకున్న వెంటనే వేములవాడకు చెందిన స్నేక్ క్యాచర్ జగదీశ్ అక్కడికి చేరుకున్నాడు. భక్తులు సైతం ఈ పామును చూడటానికి భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో పాము అటు ఇటు తిరుగుతూ హల్‌చల్ చేసింది.

సహజంగా శ్వేత నాగులు జనం మధ్యలో కనబడవు.. దట్టమైన అటవీ ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి పాములు కనబడుతుంటాయి. అయితే, ఈ శ్వేత నాగు ఇక్కడ కనబడటంతో దేవుడు మహిమగానే భావిస్తున్నారు భక్తులు. సుమారుగా అరగంటసేపు శ్వేతనాగు ఇదే ప్రాంతంలో సంచరించింది. ఎవరికి హాని చేయకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత స్నేక్ క్యాచర్ జగదీష్ అత్యంత చాకచక్యంగా శ్వేతనాగును పట్టుకున్నాడు. అయితే.. నాగు పామును పట్టుకునే క్రమంలో.. అది స్నేక్ క్యాచర్ పై తిరగబడింది.

వీడియో చూడండి..

అయితే.. పామును రెస్య్యూ చేసిన తరువాత .. జగదీశ్ దానిని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. ఇటీవల కాలంలో భీమేశ్వర ఆలయం సమీపంలో నాగుపాముల సంచారం పెరిగిపోయింది. దీంతో భక్తులు భయపడుతున్నారు. ఈ ప్రాంతంలో పాములు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. వేసవికాలం కావడంతో వేడిని తట్టుకోక పాములు బయటికి వచ్చే అవకాశం ఉందని స్నేక్ క్యాచర్ చెప్తున్నాడు. ఎక్కడైనా పాము కనబడితే తమకు సమాచారం ఇస్తే వెంటనే వచ్చి పట్టుకుంటామని, పాములకు హాని చేయవద్దని కోరుతున్నారు. శ్వేతనాగులు మైదాన ప్రాంతాలు కనబడడం అరుదని ఆయన చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us